కనక మహాలక్ష్మి బ్యాంకుకు ప్రతిష్టాత్మక అవార్డు
ABN, First Publish Date - 2022-03-06T05:48:34+05:30
కనక మహాలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకుకు బెస్ట్ డిజిటల్ బ్యాంకు అవార్డు లభించింది.
విశాఖపట్నం, మార్చి 5 : కనక మహాలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకుకు బెస్ట్ డిజిటల్ బ్యాంకు అవార్డు లభించింది. గోవాలో బ్యాంకింగ్ ఫ్రంటీయర్స్ ఆధ్వ ర్యంలో గత ఏడాది డిసెంబరు 12న జాతీయ స్థాయిలో జరిగిన కో–ఆపరే టివ్ బ్యాంకింగ్ అవార్డుల కార్యక్రమం లో మధ్యతరహా అర్బన్ బ్యాంకుల కేటగిరిలో విశాఖ నగరానికి చెందిన కనకమహాలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకుకు ఈ ఆవార్డు దక్కింది. దేశంలోని ప్రముఖ బ్యాంకులకు దీటుగా డిజిటల్ సేవలందించ డంలో తమ బ్యాంకుకు అవార్డు లభించిందని బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుడు పి.రఘునాధరావు తెలిపారు. ఈమేరకు సిబ్బిందిని అభినందించారు. బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణా ధికారి కె.శ్యామ్‌కిశోర్ సిబ్బంది పాల్గొన్నారు
Updated Date - 2022-03-06T05:48:34+05:30 IST