ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టపాసులు ఇస్తానని నమ్మించి..

ABN, First Publish Date - 2022-10-29T00:15:14+05:30

దీపావళి టపాసులు ఇస్తానని నమ్మించి బాలికను ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల అదుపులో నిందితుడు

మొగల్తూరు మండలంలో దారుణం

మొగల్తూరు, అక్టోబరు 28 : దీపావళి టపాసులు ఇస్తానని నమ్మించి బాలికను ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు దిశ డీఎస్పీ కేవీ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (8) గురువారం రాత్రి వీధిలో అడుకుం టుండగా అదే ప్రాంతానికి చెందిన ఆకన శ్రీను (55) అనే వ్యక్తి దీపా వళి మందులు ఇస్తానని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధిత బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన ఘటన తల్లికి చెప్పడంతో బంధువుల సాయంతో మొగల్తూరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను ఆస్పత్రికి తరలించారు. దిశ పోలీసులకు సమాచారం అందడంతో ఏలూరు నుంచి క్లూస్‌ టీమ్‌ వచ్చి ఘటన జరిగిన ఇంటిలోని గదులను పరిశీలించి పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు నిందితుడిపై పోక్సో కేసుతో పాటు అత్యాచారం కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నరసాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఎస్పీ రవిప్రకాశ్‌ పరామర్శించారు. అనంతరం ఘటన జరిగిన ప్రాంతాన్ని, బాలిక ఇంటిని పరిశీలించారు.

Updated Date - 2022-10-29T00:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising