హమాలీ మహిళలకు రక్షణ కల్పించాలి
ABN, First Publish Date - 2022-11-08T23:33:39+05:30
కొమడవోలు హమాలి కాలనీలోని మహిళలకు రక్షణ కల్పించాలని ఇప్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఏలూరు టూటౌన్, నవంబరు 8: కొమడవోలు హమాలి కాలనీలోని మహిళలకు రక్షణ కల్పించాలని ఇప్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాలనీలో కొంతమంది ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తు న్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాలనీలో ఆరాచక శక్తులు విజృంభిస్తున్నాయని వారి నుంచి ప్రజలకు, మహిళలకు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
Updated Date - 2022-11-08T23:33:47+05:30 IST