ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలాగేనా రైతులను ఆదుకునేది?

ABN, First Publish Date - 2022-10-29T23:42:07+05:30

ఏ ప్రాంతానికి వెళ్లిన వర్షాలకు దెబ్బతిన్న పంటలే కనిపిస్తున్నాయి. రైతులు తమ కష్టాలు చెప్పుకుంటూ పొలాల్లోనే కన్నీరు పెట్టుకుంటున్నారు.

చీనీతోటలోని వర్షపు నీటిలో సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌

అనంతపురం రూరల్‌, అక్టోబరు 29: ‘ఏ ప్రాంతానికి వెళ్లిన వర్షాలకు దెబ్బతిన్న పంటలే కనిపిస్తున్నాయి. రైతులు తమ కష్టాలు చెప్పుకుంటూ పొలాల్లోనే కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల్లో ఒక్కరంటే ఒక్కరికైనా రైతుల కష్టాలు కనిపించలేదా? ఇలాగేనా రైతులను ఆదుకునేది’ అంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ మండిపడ్డారు. శనివారం మండలంలోని అక్కంపల్లి, కురుగుంట సమీపంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీపీఐ ఆధ్వర్యంలో పరిశీలించారు. పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్‌, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున తదితరులు పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత రెండురోజులుగా జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై పర్యటిస్తున్నాం. ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఉద్యాన పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నా యని తెలిపారు. పత్తి, మిరప, వేరుశనన పంటలు తుడిచిపెట్టుకుపోయా యన్నారు. ప్రభుత్వం ఎక్కడ కూడా నష్టాన్ని లెక్కకట్టింది లేదన్నారు. నకిలీ కంపెనీ, డీలర్లు, విత్తనాల కారణంగా కూడా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. నకిలీలపై యాడికి మండలంలో పోలీసుస్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. రైతులు ఫిర్యాదు చేసినా కేసుకట్టారా అని ప్రశ్నించారు. వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ రైతులకు ఎకరాకు రూ.25వేలు, ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా 50టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. ఉమ్మడి జిల్లా జనాభాకు అనుగుణంగా నీటి నిల్వ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీటిపై ఈనెల 31న రైతు సంఘాలు, రైతులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, రాజే్‌షగౌడ్‌, చెన్నప్ప, రామకృష్ణ, నాగరాజు, శ్రీకాంత, రమేష్‌, నరేష్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-29T23:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising