ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులివ్వడం హాస్యాస్పదం: శ్రవణ్‌కుమార్

ABN, First Publish Date - 2022-10-22T18:55:25+05:30

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)కు మహిళా కమిషన్ నోటీసులివ్వడం హాస్యాస్పదంగా ఉందని అడ్వకేట్ జడ శ్రవణ్‌కుమార్ (Jada Shravankumar) పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

sravan kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)కు మహిళా కమిషన్ నోటీసులివ్వడం హాస్యాస్పదంగా ఉందని అడ్వకేట్ జడ శ్రవణ్‌కుమార్ (Jada Shravankumar) పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కు ఇచ్చినట్లే.. విడాకులిచ్చిన వారందరికీ నోటీసులు ఇస్తారా?... తర్వాత కోర్టులు వాటిని కొట్టేస్తే న్యాయస్థానాలను తప్పు పడతారా? అని ప్రశ్నించారు. అలా అయితే సీఎం సోదరి రెండవ వివాహం చేసుకున్నారని, ఆమెకు కూడా నోటీస్ ఇస్తారా అని జడ శ్రవణ్‌కుమార్ నిలదీశారు. తాను చంద్రబాబును కలిస్తే కొందరు వక్రీకరిస్తున్నారని తప్పుబట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాట్లాడడం తప్పు కాదన్నారు. వైసీపీ వచ్చాక దళితులకు అందుతున్న అనేక పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. పథకాల రద్దుపై రోజుకో దళిత సంఘం ఆందోళన చేస్తుంటే.. వైసీపీలో ఉన్న దళిత ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు?.. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే తనపై కేసులు పెడతారా?: అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలు చేస్తున్నది వైసీపేనని జడ శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు.

Updated Date - 2022-10-22T18:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising