AP highcourt: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్
ABN, First Publish Date - 2022-10-12T18:24:35+05:30
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantababu)కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది.
అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantababu)కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్ట్ డిస్మిస్ చేసింది. గతంలో అనంతబాబు (YCP MLC) డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయగా... ధర్మాసనం కొట్టివేసింది. పోలీసులు 90 రోజుల్లో చార్జ్‌షిట్ వేయనందున బెయిల్ ఇవ్వాలని హైకోర్టును వైసీపీ ఎమ్మెల్సీ కోరారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. బాధితుల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కాగా... దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి అనంతబాబు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో మూడు సార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
Updated Date - 2022-10-12T18:24:35+05:30 IST