ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharti Airtel: సరిహద్దు గ్రామంలో 4జీ సేవలు.. చరిత్ర సృష్టించిన ఎయిర్‌టెల్

ABN, First Publish Date - 2022-11-29T16:24:40+05:30

దేశంలో రెండో అతిపెద్ద టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) మరోమారు రికార్డులకెక్కింది. భారత సరిహద్దు గ్రామమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) మరోమారు రికార్డులకెక్కింది. భారత సరిహద్దు గ్రామమైన లడఖ్‌‌లోని కార్గిల్ జిల్లాలో ఉన్న అతి చిన్న గ్రామమైన కక్సార్‌(Kaksar)లో 4జీ సేవలను ప్రారంభించింది. ఇప్పుడీ గ్రామంలోకి 4జీ సేవలు అందుబాటులోకి రావడంతో అక్కడి ప్రజలు కూడా దేశ డిజిటల్ డ్రైవ్‌లో పాల్గొనేందుకు అవకాశం చిక్కిందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఇప్పుడు తమ 4జీ నెట్‌వర్క్ సేవలు కక్సార్‌తోపాటు లటూ గ్రామాలకు కూడా అందుబాటులో వస్తాయని పేర్కొంది.

ఈ సందర్భంగా భారతీ ఎయిర్‌టెల్ అప్పర్ నార్త్ సీఈవో పుష్పీందర్ సింగ్ గుజ్రాల్ మాట్లాడుతూ.. వినియోగదారులకు అత్యంత నాణ్యమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఈ సేవలతో సరిహద్దు గ్రామాల ప్రజలకు మరింతమందితో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుందన్నారు. ఎల్ఓసీ ప్రాంతంలో సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న తమ కలలను నిజం చేసేందుకు సాయం చేసిన టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.

కక్సార్‌, లటూ గ్రామాల్లో 4జీ సేవలు (4G Services) అందుబాటులోకి రావడంతో స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో పెను మార్పులు కనిపించనున్నాయి. లడఖ్‌లోని ఈ ప్రాంతాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి టెలికం సంస్థగా ఎయిర్‌టెల్ (Airtel) అవతరించింది. ఈ ప్రాంతంలో 4జీ సేవలను అందుబాటులోకి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో వాటిని 5జీ సేవలుగా మార్చే అవకాశం లభించింది.

Updated Date - 2022-11-29T16:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising