ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bank Holidays: ఈ నెలలో బ్యాంకు పనులు పెట్టుకునే వాళ్లకు ఈ విషయం తెలుసా..?

ABN, First Publish Date - 2022-12-01T13:15:03+05:30

2022లో చివరి నెలకు కూడా వచ్చేశాం. డిసెంబర్ 1 (December 1) వచ్చిందంటే చాలు.. కొన్ని పనులు పూర్తి చేసుకునేందుకు గడువు ముంచుకొచ్చినట్టే. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2022లో చివరి నెలకు కూడా వచ్చేశాం. డిసెంబర్ 1 (December 1) వచ్చిందంటే చాలు.. కొన్ని పనులు పూర్తి చేసుకునేందుకు గడువు ముంచుకొచ్చినట్టే. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న బ్యాంకు పనులను పూర్తి చేసేందుకు బ్యాంకుల ముందు జనాలు క్యూ కడుతుంటారు. అయితే.. అలా బ్యాంకుల బాట పట్టే వాళ్లు బ్యాంకుల సెలవుల (Bank Holidays) గురించి తప్పక తెలుసుకోవాలి. లేకపోతే బ్యాంకుల వరకూ వెళ్లి నిరాశగా వెనుదిరగాల్సి వస్తుంది. రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవుల్లో మార్పు ఉంటుందని ఖాతాదారులు గమనించగలరు.

బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. 2022 డిసెంబర్‌లో ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిలో 8 రోజులు సెలవులు కాగా.. మిగిలిన ఆరు రోజులు వీకెండ్ సెలవులు కావడం గమనార్హం. అయితే.. 14 రోజుల పాటు దేశంలోని అన్ని చోట్ల బ్యాంకులు మూతపడవన్న సంగతి గమనించగలరు. ఏఏ తేదీల్లో ఎక్కడెక్కడ బ్యాంకులు మూతపడనున్నాయో సవివరంగా తెలుసుకుందాం..

* డిసెంబర్ 3: Feast of St. Francis Xavier. ఈ కారణంగా పనాజీలో బ్యాంకులు మూసివేత

* డిసెంబర్ 5: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అహ్మదాబాద్‌లో బ్యాంకులు బంద్

* డిసెంబర్ 12: Pa-Togan Nengminja Sangma. ఈ కారణంలో షిల్లాంగ్‌లో బ్యాంకులు క్లోజ్.

* డిసెంబర్ 19: Goa Liberation Day. ఈ కారణంగా పనాజీలో బ్యాంకులకు సెలవు

* డిసెంబర్ 26: క్రిస్మస్ నేపథ్యంలో ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్‌లో బ్యాంకులు క్లోజ్

* డిసెంబర్ 29: గురు గోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ఛండీఘర్‌లో బ్యాంకులు బంద్

* డిసెంబర్ 30: షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేత

* డిసెంబర్ 31: న్యూ ఇయర్ నేపథ్యంలో ఐజ్వాల్‌లో బ్యాంకులు క్లోజ్

* డిసెంబర్ 10: రెండో శనివారం

* డిసెంబర్ 4: ఆదివారం

* డిసెంబర్ 11: ఆదివారం

* డిసెంబర్ 18: ఆదివారం

* డిసెంబర్ 24: నాలుగో శనివారం

* డిసెంబర్ 25: ఆదివారం

Updated Date - 2022-12-01T13:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising