ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BSNL: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త.. 4జీ ఎప్పుడొస్తుందో చెప్పేసిన టెల్కో!

ABN, First Publish Date - 2022-11-01T21:03:46+05:30

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారులకు ఇది గొప్ప శుభవార్తే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారులకు ఇది గొప్ప శుభవార్తే. స్వదేశీ టెక్నాలజీ, పరికరాలతో 4జీ లాంచ్ చేయడంపై తాజాగా ట్వీట్ చేసింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ ఇప్పటికే 5జీని ప్రారంభించగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3జీ దగ్గరే ఆగిపోయింది. 4జీ లాంచ్ కోసం ఏళ్ల తరబడి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బీఎస్ఎన్ఎల్ పరిస్థితులు మెరుగుపడాలంటే వీలైనంత త్వరగా 4జీ సేవలు ప్రారంభించడం అవసరం. ఆ తర్వాతే 5జీకి అప్‌గ్రేడ్ కావడానికి మార్గం సుగమం అవుతుంది.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన కట్ని అనే ట్విట్టర్ యూజర్ 4జీ లాంచ్ ఎప్పుడని ప్రశ్నిస్తూ బీఎస్ఎఎన్ఎల్‌ను ట్యాగ్ చేశాడు. స్పందించిన బీఎస్ఎన్ఎల్.. తేదీని చెప్పడం కష్టమని, అయితే బీఎస్ఎన్ఎల్ 4జీ లైసెన్స్‌ను పొందిందని కట్ని ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న ఎక్విప్‌మెంట్ రవాణా జరుగుతోందని పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి ఇన్‌స్టాలేషన్ ప్రారంభమవుతుందని వివరించింది.

టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2023 ప్రారంభంలో బీఎస్ఎన్ఎల్ 4జీ లాంచ్ ట్రాక్‌లోకి వస్తుందని తెలిపారు. త్వరలోనే ఇది పక్కాగా జరిగి తీరుతుందని హామీ ఇచ్చారు. కాగా, గతంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికే బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. అయినా, అది జరగలేదు. 4జీ నెట్‌వర్క్ లేకపోవడంతో బీఎస్ఎన్ఎల్ చందాదారులు క్రమంగా జారిపోతున్నారు. ఒకసారి 4జీ సేవలు లాంచ్ అయితే ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, బీఎన్ఎన్ఎల్‌కు చాలా నమ్మకమైన చందాదారులు ఉన్నారు. ఇది ఆ సంస్థకు కలిసివచ్చే అంశం. కాగా, దేశంలో ఒక్క బీఎస్ఎన్ఎల్ తప్ప మరే టెల్కో కూడా 4జీ సేవల విషయంలో స్వదేశీ టెక్నాలజీని, పరికరాలను ఉపయోగించలేదు.

Updated Date - 2022-11-01T21:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising