ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

VLC Player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై కేంద్రం కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2022-11-14T17:51:28+05:30

మల్టీమీడియా ప్లేయర్ వీసీఎల్‌ (VCL) విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో వీసీఎల్‌ వెబ్‌సైట్‌పై ఈ ఏడాది ఆరంభంలో విధించిన నిషేధాన్ని తాజాగా తొలగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మల్టీమీడియా ప్లేయర్ వీసీఎల్‌ (VCL) విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో వీసీఎల్‌ వెబ్‌సైట్‌పై ఈ ఏడాది ఆరంభంలో విధించిన నిషేధాన్ని తాజాగా తొలగించింది. డౌన్‌లోడింగ్‌కు కూడా అందుబాటులో ఉంచడంతో యూజర్లు తిరిగి ఉపయోగించకోవచ్చు. యూజర్లు వీడియోలాన్స్(VideoLan) వెబ్‌సైట్‌కి వెళ్లి వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆఫీసియల్ వెబ్‌సైట్ డేటా ప్రకారం.. ఇప్పటివరకు 73 మిలియన్ల మంది వీఎల్‌సీ ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరింత మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. కాగా గతంలో ఈ మీడియా ప్లేయర్‌పై కేంద్రం నిషేధం విధించడానికి కారణం ఏంటో తెలియరాలేదు. పొరపాటున నిషేధం విధించి ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

గత నెల అక్టోబర్‌లో వీఎల్‌సీ మేకర్స్.. కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపించారు. భారత్‌లో తమ సర్వీసులు ఎందుకు తొలగించారో చెప్పాలని కోరారు. భారత్‌లో ప్రతి ఏడాది 25 మిలియన్ల డౌన్‌లోడ్స్ అవుతున్న ఈ మీడియా ప్లేయర్‌పై నిషేధానికి కారణం ఏమిటో చెప్పాలని, లేదంటే తమ హక్కుల కోసం చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేయడం గమనార్హం.

Updated Date - 2022-11-14T17:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising