Chanda Kochhar: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త అరెస్ట్!
ABN, First Publish Date - 2022-12-24T12:41:11+05:30
వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్(Videocon Group of Companies)కు మోసపూరితంగా రుణాలు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్(Videocon Group of Companies)కు మోసపూరితంగా రుణాలు మంజూరు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చార్ (Chanda Kochhar) , ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. దీపక్ కొచ్చర్ (Deepak Kochhar) కంపెనీ న్యూ పవర్ రెన్యువబుల్(NuPower Renewable)కు, వీడియోకాన్ గ్రూపునకు మధ్య క్విడ్ ప్రొ కో జరిగిందని, దీపక్ కంపెనీలో వీడియోకాన్ పెట్టుబడులు పెట్టిందని అభియోగాలున్నాయి.
వీడియోకాన్‌కు మంజూరు చేసిన రుణం ఆ తర్వాత నాన్-ఫెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా మారింది. అనంతరం దానిని ‘బ్యాంకు మోసం’గా పరిగణించారు. సెప్టెంబరు 2020లో దీపక్ కొచ్చర్‌ను ఈడీ కూడా అరెస్ట్ చేసింది. చందా కొచ్చర్ సారథ్యంలోని ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్ గ్రూపునకు రూ. 3,250 కోట్ల రుణం ఇచ్చింది. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు చెందిన సుప్రీం ఎనర్జీ (Supreme Energy).. న్యూపవర్ రెన్యువబుల్‌కు రూ. 64 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థలో కొచ్చర్‌కు 50 శాతం వాటా ఉంది.
Updated Date - 2022-12-24T13:33:25+05:30 IST