ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదానీ... అంబానీ...

ABN, First Publish Date - 2022-02-09T00:37:16+05:30

ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అధిగమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అధిగమించారు. ఈ క్రమంలో... ఆసియా నంబర్ వన్ కుబేరునిగా అవతరించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం... నిన్నటికి(సోమవారం నాటికి) ఈ 59 ఏళ్ల అదానీ సంపద 88.5 బిలియన్ డాలర్లు కాగా, ముఖేష్ అంబానీ సంపద 87.9 బిలియన్ డాలర్లు. ఈ(2022) క్యాలెండర్ ఏడాదిలో... అదానీ సంపద 12 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యంత ఎక్కువగా సంపాదన ఉన్న వారిలో అదానీయే ముందున్నారు. 


ఓహ్... 600 శాతం జంప్... 

అదానీ గ్రూప్ సరైన సమయంలో సరైన అంశాలపై దృష్టి సారించిందని, ఇది విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడిదారుల వైపు మళ్లిందని చెబుతున్నారు. గత రెండేళ్లలో అదానీ గ్రూపునకు చెందిన పలు లిస్టింగ్ స్టాక్స్ 600 శాతం వరకు లాభపడడం గమనార్హం. మరో యాభై ఏళ్ళ(2070 నాటికి)లో... భారత్‌ను జీరో కార్బన్ దేశంగా చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని, ముందుకు సాగుతోన్న విషయం తెలిసిందే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఉన్న అదానీకి ఇది  ప్రయోజనంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే... ఈ స్టాక్స్ 600 శాతం మేర లాభపడ్డాయి. ఎంఎస్‌సీఐ ఇంక్ భారతీయ బెంచ్ మార్క్ ఇండెక్స్‌లో మరిన్ని అదానీ కంపెనీలను చేర్చడానికి తీసుకున్న నిర్ణయం కూడా ఈ క్రమానికి దోహదపడిందని చెబుతున్నారు. 


గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్... 

రెండేళ్ళ క్రితం(2020 లో) అంబానీ సంపద భారీగా పెరిగింది. చమురు నుండి పెట్రోకెమికల్స్ వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కలిసొచ్చింది. ఫేస్‌బుక్, గూగుల్ ఇంక్‌లు ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో ముఖేష్ కంపెనీకి పెద్దఎత్తున సంపద సమకూరింది. అయితే గత రెండేళ్లుగా సంపద వృద్ధి అంబానీ నుండి అదానీ వైపు మళ్లడం గమనార్హం. శిలాజ ఇంధనాలు, లేదా...  బొగ్గుపై తమ సామ్రాజ్యాలను నిర్మించుకున్న ఈ ఇరువురు భారతీయ బిలియనీర్లు... ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతుండడం విశేషం. నీలలో పెట్టుబడులు పెట్టింది.

Updated Date - 2022-02-09T00:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising