భారీగా పెరిగిన ఎల్‌ఐసీ లాభం
ABN, First Publish Date - 2022-11-12T02:25:13+05:30
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీ నికర లాభం పలు రెట్లు పెరిగి రూ.15,952 కోట్లుగా నమోదైంది.
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీ నికర లాభం పలు రెట్లు పెరిగి రూ.15,952 కోట్లుగా నమోదైంది. పెట్టుబడులపై వచ్చిన లాభం ఇందుకు కారణం. గత ఏడాది ఇదే కాలంలో ఎల్‌ఐసీ లాభం రూ.1,434 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో ఎల్‌ఐసీ మొత్తం ప్రీమియం ఆదాయం రూ.1,32,631.72 కోట్లు కాగా మొత్తం ఆదాయం రూ.22,29,488.50 కోట్లు ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ప్రీమియం ఆదాయం రూ.1,04,913.92 కోట్లు, మొత్తం ఆదాయం రూ.18,72,043.60 కోట్లుగా ఉంది.
Updated Date - 2022-11-12T02:28:35+05:30 IST