Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు బ్యాడ్‌న్యూస్ !
ABN, First Publish Date - 2022-12-09T21:38:11+05:30
వచ్చే ఏడాది 2023లో గ్లోబల్ మార్కెట్ల (Global Markets) స్థాయిలో భారతీయ ఈక్విటీ మార్కెట్లు (Indian Eqity markets) రాణించలేవని గోల్డ్‌మాన్ సాచ్స్ (Goldman Sachs) ఆసియా పసిఫిక్ ఈక్విటీ చీఫ్ స్ట్రాటజిస్ట్ తిమోతీ మో (Timothy Moe) అంచనా వేశారు.
ముంబై: వచ్చే ఏడాది 2023లో గ్లోబల్ మార్కెట్ల (Global Markets) స్థాయిలో భారతీయ ఈక్విటీ మార్కెట్లు (Indian Eqity markets) రాణించలేవని గోల్డ్‌మాన్ సాచ్స్ (Goldman Sachs) ఆసియా పసిఫిక్ ఈక్విటీ చీఫ్ స్ట్రాటజిస్ట్ తిమోతీ మో (Timothy Moe) అంచనా వేశారు. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) వడ్డీ రేట్లు పెంచుతున్న పరిస్థితుల మధ్య ఇండియన్ స్టాక్ వ్యాల్యూయేషన్లు అధికంగా ఉండడం ఇందుకు కారణమన్నారు. తీవ్ర ద్రవ్యోల్బణం పరిస్థితులు దాదాపు ముగిసిపోయినప్పటికీ.. ఆర్బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు పెంచొచ్చని అన్నారు. డిసెంబర్ 7న రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీనినిబట్టి ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ తదుపరి మోనిటరీ పాలసీ భేటీలో కూడా కఠిన నిర్ణయాలే తీసుకుంటుందని భావించవచ్చునని తిమోతీ అన్నారు.
మరోవైపు గ్లోబల్ మార్కెట్ల స్థాయిలో రాణించలేకపోయినా ఆసియాలోని ఇతర మార్కెట్లతో పోల్చితే వృద్ధి, లాభాల విషయంలో ఇండియన్ మార్కెట్ల అవకాశాలు ఆశావాదంగానే ఉంటాయని తిమోతీ విశ్లేషించారు. దీర్ఘకాలంపరంగా చూసుకుంటే ఆసియాలో ఉత్తమంగా రాణించే మార్కెట్లలో భారత్ కూడా ఉంటుందన్నారు. ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పందించారు.
Updated Date - 2022-12-09T21:38:16+05:30 IST