JioFiber: డబుల్ బొనాంజా ఆఫర్‌కు ఈ రోజే లాస్ట్.. త్వరపడండి
ABN, First Publish Date - 2022-10-28T17:14:33+05:30
జియో ఫైబర్ (JioFiber) ఇటీవల ప్రవేశపెట్టిన ‘డబుల్ బొనాంజా ఫెస్టివల్ ఆఫర్‘(Double Bonanza festive offer)ఈ రోజుతో ముగియనుంది
న్యూఢిల్లీ: జియో ఫైబర్ (JioFiber) ఇటీవల ప్రవేశపెట్టిన ‘డబుల్ బొనాంజా ఫెస్టివల్ ఆఫర్‘(Double Bonanza festive offer)ఈ రోజుతో ముగియనుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ ఆఫర్‌ను పొందలేకపోయిన వారు త్వరపడడం మంచిది. ఈ నెల 18న జియో ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌లో భాగంగా కొత్తగా జియో ఫైబర్ కనెక్షన్ తీసుకునే వారికి రూ. 6,500 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ. 599, రూ. 899తో రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్లాన్లలో రిలయన్స్ డిజిటల్, అజియో, నెట్‌మెడ్స్, ఇక్సిగో వంటి కొన్ని పెద్ద బ్రాండ్ల నుంచి కూపన్ల రూపంలో నూటికి నూరుశాతం తిరిగి పొందొచ్చు. ఈ ఆఫర్లు, ప్రయోజనాలు పొందాలంటే యూజర్లు జియో ఫైబర్ కనెక్షన్‌ను ఈ రోజే తీసుకోవాల్సి ఉంటుంది.
రూ. 599 ప్లాన్‌ను కనీసం ఆరు నెలలపాటు తీసుకోవాల్సి ఉంటుంది. రూ. 899 ప్లాన్‌ను కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లతోపాటు రూ. 6 వేల విలువైన సెట్ టాప్ బాక్స్ (STB)ను అదనంగా ఎలాంటి రుసుము తీసుకోకుండా యూజర్లకు అందిస్తుంది. ఈ పోస్టు పెయిడ్ ప్లాన్లను ఆరు నెలలపాటు తీసుకుంటే జియో ఫైబర్ నుంచి అదనంగా ఎలాంటి మొత్తం వసూలు చేయకుండానే 15 రోజుల ఉచిత సర్వీసు లభిస్తుంది.
అలాగే, ఈ ప్లాన్లను ఆరు నెలలకు గానీ, మూడు నెలలకు గానీ కొనుగోలు చేస్తే జియో ఫైబర్ అందిస్తున్న జీరో ఎంట్రీ కాస్ట్ ఆఫర్ నుంచి కూడా వినియోగదారులు ప్రయోజనం పొందుతారు. ఈ ఆఫర్ కింద ఇన్‌స్టాలేషన్ కోసం కానీ, డిపాజిట్ కోసం కానీ పైసా కూడా చెల్లించాల్సిన పని ఉండదు. జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల నుంచి ఓటీటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే, 30 ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ ప్లాన్లకు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌పై ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ పండుగ ఆఫర్ ప్రయోజనాన్ని పొందేందుకు నేడు చివరి రోజు.
Updated Date - 2022-10-28T17:16:21+05:30 IST