రిలయన్స్ బోర్డులోకి కేవీ కామత్
ABN, First Publish Date - 2022-11-05T02:30:34+05:30
ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ తన బోర్డు సభ్యుడిగా నియమించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ తన బోర్డు సభ్యుడిగా నియమించింది. ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. దీనికి తోడు కామత్‌ను రిలయన్స్ ఆర్థిక సేవల విభాగం రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌ఐఎల్)కు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గానూ నియమించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్‌ఎస్‌ఎల్) పేరుతో ఈ సంస్థ త్వరలో పెద్ద ఎత్తున ఆర్థిక సేవల రంగంలోకి దిగనుంది. ఇందుకు ఆర్థిక సేవల రంగంలో కామత్‌కు ఉన్న అనుభవం ఉపయోగపడుతుందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆలోచనగా చెబుతున్నారు. 2002లో దీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత అన్నదమ్ములు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య ఆస్తులు, వ్యాపారాల పంపకంలోనూ కామత్ కీలక పాత్ర పోషించారు.
Updated Date - 2022-11-05T02:30:36+05:30 IST