ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LIC: కొత్త పాలసీల కోసం అన్వేషిస్తున్నవారికి ఎల్‌ఐసీ గుడ్‌న్యూస్..

ABN, First Publish Date - 2022-11-24T20:58:40+05:30

కొత్త ఇన్సూరెన్స్ పాలసీల కోసం అన్వేషిస్తున్నవారికి గుడ్‌న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ‘న్యూ జీవన్ అమర్’ ( New Jeevan Amar), టెక్ టర్మ్ (Tech Term) పేరిట రెండు అష్యూరెన్స్ ప్లాన్స్‌ను ఆవిష్కరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొత్త ఇన్సూరెన్స్ పాలసీల కోసం అన్వేషిస్తున్నవారికి గుడ్‌న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ‘న్యూ జీవన్ అమర్’ ( New Jeevan Amar), టెక్ టర్మ్ (Tech Term) పేరిట రెండు అష్యూరెన్స్ ప్లాన్స్‌ను ఆవిష్కరించింది. ఈ రెండూ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్స్.. అంటే పాలసీదారులు ఫిక్స్‌డ్ ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. గ్యారంటీ రిటర్నులు ఉంటాయి. నాన్-లింక్డ్ ప్లాన్లు స్టాక్ మార్కెట్లతో ముడిపడి ఉండవు కాబట్టి రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది.

జీవన్ అమర్ స్కీమ్‌లో లెవల్ సమ్ అష్యూర్డ్, ఇన్‌క్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అనే రెండు ఆప్షన్లను ఎంచుకోవచ్చు. సింగిల్ ప్రీమియం పేమెంట్ లేదా ఒక రెగ్యులర్ ప్రీమియం పేమెంట్‌ను ఎంచుకోవచ్చు. పరిమిత ప్రీమియం పేమెంట్ ఆప్షన్‌ను ఎల్ఐసీ ఆఫర్ చేస్తోంది. మరోవైపు న్యూజీవన్ అమర్ ప్లాన్ కింద మహిళలకు ప్రత్యేక రేట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. స్మోకర్స్, నాన్-స్మోకర్స్‌కు వేర్వేరు ప్రీమియం రేట్లు ఉంటాయని ఎల్‌ఐసీ (LIC) వెబ్‌సైట్‌పై డేటా చెబుతోంది.

సింగిల్ ప్రీమియం ప్లాన్ కింద కనీస ప్రీమియం రూ.30 వేలుగా ఉండగా.. రెగ్యులర్, లిమిటెడ్ విధానాల్లో పేమెంట్ రూ.3 వేలుగా ఉంది. యురినరీ కోటినిన్ టెస్టులో వెల్లడయ్యే విషయాల ఆధారంగా నాన్-స్మోకర్ రేట్లను నిర్ణయిస్తారు. రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ కింద సరెండర్ వాల్యూ సున్నాగా ఉంది. రైడర్ ఆన్ పేమెంట్‌పై అదనపు ప్రీమియంతో యాక్సిడెంట్ ప్రయోజనాలు కూడా పొందే వీలుంది. ఇక బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.25 లక్షలుగా ఉండగా.. గరిష్ఠ మొత్తానికి పరిమితి విధించలేదు. 18-65 ఏళ్ల మధ్య వయస్కులు న్యూజీవన్ అమర్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీ టర్మ్ 10-40 ఏళ్లుగా ఉంది. ఐదేళ్లు ఇన్‌స్టాల్‌మెంట్స్ పూర్తయిన తర్వాత డెత్ బెనిఫిట్స్‌ పొందే ఆప్షన్ కూడా ఉందని ఎల్ఐసీ డేటా తెలిపింది.

Updated Date - 2022-11-24T21:28:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising