ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NPS: ఎన్‌పీఎస్‌ ద్వారా రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.75 వేల పెన్షన్ పొందొచ్చు... ఇలా చేయండి చాలు..

ABN, First Publish Date - 2022-12-04T17:00:37+05:30

రిటైర్మెంట్‌ (retirement) తర్వాతి జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని చక్కటి ప్లాన్ కోసం అన్వేషిస్తున్నవారికి ఎన్‌పీఎస్ (National Pension System) ఒక చక్కటి పథకం (Scheme).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిటైర్మెంట్‌ (retirement) తర్వాతి జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని చక్కటి ప్లాన్ కోసం అన్వేషిస్తున్నవారికి ఎన్‌పీఎస్ (National Pension System) ఒక చక్కటి పథకం (Scheme). ఈ స్కీమ్ ద్వారా చందాదారులు తమ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. రిటైర్మెంట్ ప్లానింగ్‌కు (retirement planning) ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న స్కీమ్ ఇది. గవర్నమెంట్-స్పాన్సర్డ్ స్కీమ్ దీంట్లో వ్యక్తిగతంలో ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా రిటైర్మెంట్ లక్ష్యాలు దరిచేరవచ్చు. ఎన్‌పీఎస్ మెచ్యూరిటీ తర్వాత సబ్‌స్ర్కైబర్లు కార్పస్ నుంచి కొంత ఏకమొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగతా మొత్తాన్ని నెలవారీ పెన్షన్ కోసం యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. మరి ఎన్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.75 వేల పెన్షన్ పొందాలనుకునే వ్యక్తులు ఎంత పెట్టుబడి పెట్టాలో ఓ లుక్కేద్దాం...

రూ.75 వేల పెన్షన్ పొందాలనుకుంటే మెచ్యూరిటీ (60 ఏళ్ల వయసు) సమయానికి ఎన్‌పీఎస్ కార్పస్ రూ.3.83 కోట్లుగా ఉండాలి. యాన్యుటీ కొనుగోలుకు ఎన్‌పీఎస్ కార్పస్‌లో 40 శాతం ఉపయోగిస్తామనుకుంటే.. యాన్యుటీ రేటు సంవత్సరానికి 6 శాతంగా ఉంటుందని అంచనాగా ఉన్నప్పుడు రిటర్మెంట్ సమయానికి ఎన్‌పీఎస్ కార్పస్ రూ.3.83 కోట్లకు ఎలా చేరుతుందో చూద్దాం. ఇతర లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ మాదిరిగానే ఎన్‌పీఎస్ రిటర్నులు కూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించిన సమయంపైన ఆధారపడి ఉంటుంది. వీలైనంత తక్కువ వయసులో ప్రారంభించి, రెగ్యులర్‌గా కంట్రిబ్యూట్ చేస్తే పెద్దమొత్తంలో రిటైర్మెంట్ కార్పస్‌ను సంసిద్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు 25 ఏళ్ల వయసున్న వ్యక్తి ఎన్‌పీఎస్‌లో నెలకు రూ.10 వేలు చొప్పున 35 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలి. అంటే వ్యక్తికి 60 ఏళ్లు వచ్చేవరకు పెట్టుబడి పెట్టాలి. ఏడాదికి 10 శాతం రిటర్నులు లభిస్తే మెచ్యూరిటీ సమయానికి ఎన్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ రూ.3,82,82,768 కోట్లకు (రూ.3.82 కోట్లు) పెరిగింది.

Updated Date - 2022-12-04T17:01:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising