ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Paytm: పేటీఎం ఇన్వెస్టర్లకు తీరని నష్టం.. మంగళవారం మరీ దారుణం..

ABN, First Publish Date - 2022-11-22T17:17:46+05:30

దేశీయ ఈక్విటీ మార్కెట్లపై పేటీఎం (Paytm) మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (One97 Communication) షేర్ల పతన పరంపర కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ మార్కెట్లపై పేటీఎం (Paytm) మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (One97 Communication) షేర్ల పతన పరంపర కొనసాగుతోంది. ప్రీ-ఐపీవో (initial public offering) షేర్లు ట్రేడింగ్‌కు అందుబాటులోకి వచ్చాక విక్రయాల వెల్లువ కొనసాగుతోంది. ఈ ప్రతికూల సెంటిమెంట్ ప్రభావంతో మంగళవారం సెషన్‌‌లో షేర్లు సరికొత్త కనిష్ఠానికి దిగజారాయి. బీఎస్‌ఈపై మంగళవారం ఒక్కో షేరు 11.44 శాతం మేర నష్టపోయి రూ.477.55 వద్ద ముగిసింది. పేటీఎం షేర్లకు ఇదే అత్యుల్ప స్థాయి. గతేడాది నవంబర్ 18, 2021న లిస్టింగ్ తేదీ నుంచి ఇప్పటివరకు మొత్తం 69.53 శాతం మేర పతనమైనట్టయ్యింది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. బలహీన సెంటిమెంట్ కారణంగా మంగళవారం సెషన్‌లో ఉదయం షేర్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. రికార్డ్ కనిష్ఠ స్థాయి రూ.476కి పడిపోయాయి. మొత్తంగా మంగళవారం సెషన్‌ ముగింపు సమయానికి 11.51 శాతం నష్టంతో రూ.475.20 వద్ద ముగిసింది.

ఆరంభం నుంచీ ఇదే పరిస్థితి..

గతేడాది ఐపీవో నాటి నుంచి పేటీఎం ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురిచేస్తూనే ఉంది. కాగా సెబీ నిబంధనల ప్రకారం.. ప్రీ-ఐపీవో ఇన్వెస్టర్లు లిస్టింగ్ తర్వాత 6 నెలల నుంచి ఏడాది వరకు షేర్లను హోల్డ్ చేయాల్సి ఉంటుంది. లాక్‌ఇన్ పిరియడ్ పిలిచే ఈ గడువు నవంబర్ 15, 2022న ముగిసింది. దీంతో ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ (Softbank) గతవారమే 4.5 శాతం తన వాటాను విక్రయించింది. ఒక్కో షేరు రూ.555-రూ.601 రేటుకి నష్టాలతోనే షేర్లు అమ్ముకోవాల్సి వచ్చింది. అతిపెద్ద ఇన్వెస్టరే షేర్లు అమ్మివేయడంతో మిగతా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత బలహీనపడిందని ‘ఈక్విటీ 99’ రీసెర్చ్ హెడ్ రాహుల్ శర్మ విశ్లేషించారు. పేటీఎం షేర్ల విక్రయాల వెల్లువ కొనసాగుతోందన్నారు. ప్రీ-ఐపీవో ఇన్వెస్టర్లతోపాటు నాన్-ప్రమోటర్ ఇన్వెస్టర్లు కూడా షేర్లను విక్రయిస్తుండడం సెంటిమెంట్‌ను మరింత బలహీన పరుస్తోందని చెప్పారు. లాక్‌ఇన్ పిరియడ్ ముగిసిపోవడంతో ప్రీ-ఐపీవో ఇన్వెస్టర్లను తమ షేర్లు విక్రయానికి త్వరపడుతున్నారు. ఈ పరిణామమే షేర్ల పతనానికి దారితీస్తోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Updated Date - 2022-11-22T17:25:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising