ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Redmi Note 12 Pro: బడ్జెట్‌లో ఫోన్ కొనాలనుకుంటున్నవారికి ‘రెడ్‌మీ’ గుడ్‌న్యూస్!

ABN, First Publish Date - 2022-12-19T20:38:12+05:30

ఆండ్రాయిడ్ ఫోన్ల చైనా దిగ్గజం ‘షియోమీ’ (Xiaomi) సబ్-బ్రాండ్ ‘రెడ్‌మీ’ (Redmi) కీలక ప్రకటన చేసింది. బడ్జెట్‌లో ఫోన్ కొనాలనుకుంటున్న వినియోగదార్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్’ను....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఫోన్ల చైనా దిగ్గజం ‘షియోమీ’ (Xiaomi) సబ్-బ్రాండ్ ‘రెడ్‌మీ’ (Redmi) కీలక ప్రకటన చేసింది. బడ్జెట్‌లో ఫోన్ కొనాలనుకుంటున్న వినియోగదార్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్’ను (Redmi Note 12 Pro Plus) జనవరి 5న భారత్‌లో విడుదల చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. 200 - మెగాపిక్సెల్ కెమెరాతో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తోందని నిర్ధారించింది. వోఐఎస్ (optical image stabilisation) సౌలభ్యమున్న ప్రైమరీ కెమెరాతో రానుందని, దీనిద్వారా స్టేబుల్ వీడియోలు, స్టిల్ ఫొటోలను క్యాప్చర్ చేయవచ్చునని కంపెనీ ప్రకటించింది. భారతీయ వేరియెంట్ ఫోన్ల ఫీచర్ల విషయానికి వస్తే దాదాపు గ్లోబల్ వేరియెంట్ల మాదిరిగానే ఉంటాయని కంపెనీ వివరించింది.

ఫోన్ ప్రత్యేకతలు ఇవే..

2400*1080 రిజుల్యూషన్‌తో 6.67 - ఇంచ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో రెడ్‌మీ నోట్ 12 ప్రో ఫోన్ మార్కెట్లోకి రానుంది. మెరుగైన వీక్షణ అనుభవం కోసం డాల్బీ విజన్ టెక్నాలజీ సపోర్ట్‌తో అందుబాటులోకి వస్తోంది. 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీలతో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌తో రూపొందించారు. ఇక 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 67వాట్స్ ఛార్జింగ్‌‌తో రానుంది. అయితే రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ (Redmi Note 12 Pro Plus) ఫోన్ 200 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందుబాటులోకి రానుంది. ప్రో, ప్రో ప్లస్ మోడల్స్ ఫోన్ల మధ్య ప్రధాన వ్యత్యాసం కెమెరా మాత్రమే. రెడ్‌మీ నోట్ 12 ప్రో ఫోన్ ఓఐఎస్ సౌలభ్యమున్న 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 12 ప్రో ఫోన్‌లో 5జీ, వై-ఫై 6, ఆండ్రాయిడ్ 12, ఎన్ఎఫ్‌సీ ఆధారంగా ఎంఐయుఐ 13తో అందుబాటులోకి వస్తాయనే అంచనాలున్నాయి. అయితే ఫోన్ ధరకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. చైనాలో అక్టోబర్ 28న రెడ్‌మీ నోట్ 12 ప్రో సిరీస్ ఫోన్లు రేట్ల ప్రకారం.. 6జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.19,300గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ఫోన్ ధర సుమారు రూ.24,900 వరకు ఉండొచ్చనే అంచనాలున్నాయి.

Updated Date - 2022-12-19T20:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising