ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెన్సెక్స్‌ @ 18,750 ఎగువకు నిఫ్టీ

ABN, First Publish Date - 2022-12-01T03:03:24+05:30

వరుసగా ఏడో రోజూ కొనసాగిన బుల్‌ ర్యాలీలో భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బుధవారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ తొలిసారిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సరికొత్త గరిష్ఠాలకు సూచీలు

  • రూ.288.50 లక్షల కోట్లకు బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌

ముంబై: వరుసగా ఏడో రోజూ కొనసాగిన బుల్‌ ర్యాలీలో భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బుధవారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ తొలిసారిగా 63,000 మైలురాయిని అధిగమించగా.. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 18,750 స్థాయిని దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల పాజిటివ్‌ ట్రెండ్‌తో పాటు దేశీయ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు గుమ్మరించడం ఇందుకు దోహదపడింది. బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి.. సెన్సెక్స్‌ 417.81 పాయింట్లు ఎగబాకి 63,099.65 వద్దకు చేరుకుంది. సూచీకి ఆల్‌టైం రికార్డు ముగింపు స్థాయిది. అంతేకాదు, ఒక దశలో సూచీ 621.17 పాయింట్ల పెరుగుదలతో 63,303.01 వద్ద సరికొత్త ఇంట్రాడే రికార్డు స్థాయిని నమోదు చేసుకుంది.

కాగా, నిఫ్టీ 140.30 పాయింట్ల లాభంతో 18,758.35 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపును నమోదు చేసింది. స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఆల్‌టైం రికార్డులను తిరిగి రాయ డం వరుసగా ఇది ఐదో రోజు. నవంబరులో సెన్సెక్స్‌ 3.87 శాతం, నిఫ్టీ 4.14 శాతం వృద్ధి చెందాయి.

7 రోజులు.. రూ.7.60 లక్షల కోట్లు

ప్రధాన షేర్లతో పాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీలకూ కొనుగోళ్ల ఆదరణ లభించింది. దాంతో, బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.06 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.61 శాతం పెరిగాయి. బీఎ్‌సఈలోని అన్ని రంగాల సూచీలూ లాభపడ్డాయి. యుటిలిటీస్‌ ఇండెక్స్‌ 2.52 శాతం పుంజుకోగా.. పవర్‌ సూచీ 2.35 శాతం ఎగబాకింది. మెటల్‌, ఆటో, కమోడిటీస్‌, రియల్టీ, టెకలికాం, కన్స్యూమర్‌ డిస్‌క్రిషనరీ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా పెరిగాయి. కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ సంపద సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.288.50 లక్షల కోట్లకు చేరుకుంది. ఏడు రోజుల ర్యాలీలో సెన్సెక్స్‌ 1,954.81 పాయిం ట్లు లాభపడగా.. బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7.60 లక్షల కోట్ల మేర పెరిగింది.

Updated Date - 2022-12-01T03:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising