ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tata Group: టాటా గ్రూపు కీలక ప్రణాళిక !... దేశవ్యాప్తంగా..

ABN, First Publish Date - 2022-12-12T17:39:45+05:30

యాపిల్ (Apple Inc) ఉత్పత్తులను అమితంగా ఇష్టపడే భారతీయులకు గుడ్‌న్యూస్. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు బహుళ వ్యాపార దిగ్గజం ‘టాటా గ్రూపు’ (TATA Group) దేశవ్యాప్తంగా 100 యాపిల్ స్టోర్లను (Apple Stores) తెరవాలనుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యాపిల్ (Apple Inc) ఉత్పత్తులను అమితంగా ఇష్టపడే భారతీయులకు గుడ్‌న్యూస్. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు బహుళ వ్యాపార దిగ్గజం ‘టాటా గ్రూపు’ (TATA Group) దేశవ్యాప్తంగా 100 యాపిల్ స్టోర్లను (Apple Stores) తెరవాలనుకుంటోంది. ఈ స్టోర్లలో కేవలం యాపిల్ కంపెనీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ‘ఎకనామిక్ టైమ్స్’ న్యూస్‌ పేపర్ రిపోర్ట్ పేర్కొంది. ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న కంపెనీ వర్గాలు ఈ విషయాన్ని తెలిపాయని పేర్కొంది.

కాగా టాటా గ్రూపునకు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ స్టోర్ చెయిన్ క్రోమాను (Croma) నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ రిటైల్‌ ( Infiniti Retail) అధికారిక యాపిల్ రీసెల్లర్‌గా కొనసాగనుందని, షాపింగ్ మాల్స్, ప్రధాన టౌన్లు, ఇతర లోకేషన్లలో స్టోర్లను ఏర్పాటు చేయనుందని రిపోర్ట్ తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రీమియం మాల్స్‌తో టాటా గ్రూపు సంప్రదింపులు జరుపుతోందని వివరించింది. లీజు నిబంధనల్లో బ్రాండ్‌కు సంబంధించిన వివరాలతోపాటు ఇప్పటికే ఉన్న స్టోర్లకు సమీపంలో స్టోర్లు ఏర్పాటు చేయకూడదనే సమాచారం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

యాపిల్ స్టోర్ల ఏర్పాటకు సంబంధించిన కథనాలపై ఇటు యాపిల్ కంపెనీ, అటు టాటా గ్రూపు రెండూ స్పందించలేదు. ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్‌కు స్పందించలేదని రాయిటర్స్ రిపోర్ట్ తెలిపింది. కాగా భారత్‌లోని విస్ట్రోన్ కార్ప్ తయారీ ఫెసిలిటీని 605 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు సంప్రదింపులు జరుపుతోందంటూ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రచురించిన రోజుల వ్యవధిలోనే ఈ తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇక టాటా (TATA), తైవాన్‌కు చెందిన విస్ట్రోన్ (Wistron) భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల ప్రధాన విక్రేతలుగా ఉన్నాయి. భారత్‌లో ఐఫోన్ల తయారీకి ఈ రెండు కంపెనీలు జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు సెప్టెంబర్‌లో బ్లూమ్‌బర్గ్ ఒక రిపోర్టును వెలువరించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-12T17:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising