ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కారు..

ABN, First Publish Date - 2022-10-12T06:41:25+05:30

జపాన్‌ కార్ల కంపెనీ టయోటాకు చెందిన పైలట్‌ ప్రాజెక్ట్‌ ‘ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ - స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌’ (ఎ్‌ఫఎ్‌ఫవీ-ఎ్‌సహెచ్‌ఈవీ)ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆవిష్కరించిన కేంద్ర మంత్రి గడ్కరీ 


న్యూఢిల్లీ: జపాన్‌ కార్ల కంపెనీ టయోటాకు చెందిన పైలట్‌ ప్రాజెక్ట్‌ ‘ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ - స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌’ (ఎ్‌ఫఎ్‌ఫవీ-ఎ్‌సహెచ్‌ఈవీ)ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ప్రారంభించారు. దేశం లో ఈ తరహా ప్రాజెక్టు చేపట్టడం ఇదే తొలిసారి. ఇందుకోసం బ్రెజిల్‌ నుంచి టయోటా దిగుమతి చేసుకున్న తన సెడాన్‌ మోడల్‌ ‘కరోలా ఆల్టిస్‌ ఎఫ్‌ఎ్‌ఫవీ-ఎ్‌సహెచ్‌ఈవీ’ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లోని ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటని, ప్రధానంగా రవాణా రంగం ఇందుకు కారణం అవుతోందన్నారు. అందుకే, ఇఽథనాల్‌, మిథనాల్‌ వంటి బయో ఇంధనాలతో నడిచే వాహనాలతో పాటు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్‌ఎ్‌ఫవీ-ఎ్‌సహెచ్‌ఈవీ మోడళ్లు ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్‌ పవర్‌ ట్రెయిన్‌ను కలిగి ఉంటాయి. దేశంలో తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కారైన టయోటా కరోలా ఆల్టిస్‌ ఎఫ్‌ఎ్‌ఫవీ-ఎ్‌సహెచ్‌ఈవీ.. 20 నుంచి 100 శాతం వరకు ఇథనాల్‌తో కూడిన ఇంధనంతోనూ నడవగలదు. ఈవీ మోడ్‌లోనూ నడిపే వెసులుబాటు ఉన్నందున కాలుష్యాన్ని తగ్గించగలగడంతో పాటు వాహన మైలేజీ పరంగానూ ప్రయోజనకరం. దేశంలో హరిత, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజన్లతో కూడిన మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని వాహన కంపెనీలకు ప్రభుత్వం గత ఏడాదే సూచన జారీ చేసింది. దేశంలో తొలి గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత ఫ్యూయల్‌ సెల్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (ఎ్‌ఫసీఈవీ) ‘టయోటా మిరాయ్‌’ని ఈ ఏడాది మార్చిలో గడ్కరీ విడుదల చేశారు. 

Updated Date - 2022-10-12T06:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising