డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురి దుర్మరణం
ABN, First Publish Date - 2022-10-26T10:40:19+05:30
వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రోడ్ డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టిన ఘటన చిత్రదుర్గ పట్టణం(Chitradurga town)లోని ట్రావెలర్స్ బంగ్లా వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
బెంగళూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రోడ్ డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టిన ఘటన చిత్రదుర్గ పట్టణం(Chitradurga town)లోని ట్రావెలర్స్ బంగ్లా వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మను (21) అందులో ప్రయాణిస్తున్న హరీష్ (25), సచిన్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. దీపావళి పండుగ రోజే ఈ దారుణం సంభవించడంతో మృతుల కు టుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ అదుపు తప్పడం వల్లే కారు ప్రమాదానికి గురయిందని, అతి వేగం కూడా మరో కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.. చిత్రదు ర్గ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-10-26T18:46:04+05:30 IST