భర్తను కోల్పోయి విషాదంలో ఉన్న మహిళను ఎంత దారుణంగా మోసం చేశాడంటే.. చివరకు..
ABN, First Publish Date - 2022-11-16T18:25:26+05:30
ఆ మహిళ భర్తను కోల్పోయి విషాదంలో ఉంది.. ఒంటరిగా ఉంటున్న ఆ మహిళను ఓ యువకుడు ఆకట్టుకున్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. చివరకు..
ఆ మహిళ భర్తను కోల్పోయి విషాదంలో ఉంది.. ఒంటరిగా ఉంటున్న ఆ మహిళను ఓ యువకుడు ఆకట్టుకున్నాడు.. తనకు వివాహం కాలేదని చెప్పి ఆమెతో ప్రేమ వ్యవహారం ప్రారంభించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. ఆమె నగ్నంగా ఉన్నప్పుడు వీడియో తీశాడు.. చివరకు అతడికి అప్పటికే పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నట్టు బయటపడింది.. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ఓ మహిళను ఓ యువకుడు నమ్మించి మోసం చేశాడు. 24 ఏళ్ల బాధితురాలు గతేడాది భర్తను కోల్పోయింది. ఒంటరిగా ఉంటున్న ఆమెకు జాన్ సింగ్ రావత్ అనే వ్యక్తితో పరిచయం పెరిగింది. తనకు పెళ్లి కాలేదని చెప్పి జాన్ సింగ్ ఆమెతో స్నేహం చేశాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. శృంగార సమయంలో అశ్లీల వీడియోలు కూడా తీసేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడిని బాధితురాలిని అడిగితే అతడు పట్టించుకునేవాడు కాదు. దీంతో అతడి గురించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.
జాన్ సింగ్‌కు అప్పటికే వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నట్టు బయటపడింది. దీంతో బాధితురాలు జాన్‌సింగ్‌ను నిలదీసింది. దీంతో అతను అశ్లీల వీడియోలు చూపించి బెదిరించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాన్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2022-11-16T18:25:28+05:30 IST