ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోరు అదుపులో పెట్టుకో తోపుదుర్తీ

ABN, First Publish Date - 2022-11-26T23:53:57+05:30

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌ హితవు పలికారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలసలు ఆపలేని చేతకాని ప్రభుత్వం వైసీపీది.. సీపీఐ జిల్లాకార్యదర్శి వేమయ్యయాదవ్‌

ధర్మవరం, నవంబరు 26: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌ హితవు పలికారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్ర నాయకుడు రామకృష్ణను విమర్శించే ముందు నీ స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని తోపుదుర్తి ప్రకాశరెడ్డిపై మండిపడ్డారు. క్రిమినల్‌ రికార్డులతో జైలుకెళ్లిన చరిత్ర నీదన్నారు. దిగజారుడు రాజకీయాలతో నీ సొంత ఊరికి రోడ్డు వేస్తుంటే అడ్డుపడిన చరిత్ర నీదన్నారు. కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాడుతారని, మీ లాగా స్వార్థరాజకీయాలు చేయరన్నారు. అనంతపురం జిల్లాలో నిరుద్యోగులు అధికంగా ఉన్నారని, పరిశ్రమలను రాకుండా భయపెట్టిన ఘనత మీదేనని విమర్శించారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి జింకాచలపతి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, రైతుసంఘం రాష్ట్ర వర్కింగ్‌ కార్యదర్శి కాటమయ్య, వ్యవసాయ కార్మిసంఘం నాయకులు గంగాధర్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బయన్న, సీపీఐ పట్టణ కార్యదర్శి రవి, సీకేపల్లి మండల కార్యదర్శి రాము పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T23:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising