ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ విభజన హామీలు నెరవేర్చాలి

ABN, First Publish Date - 2022-11-26T23:49:58+05:30

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలు నెరవేర్చాలని ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

నిరసన తెలుపుతున్న నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీలో విద్యార్థి సంఘాల నేతల నిరసన

అనంతపురం విద్య, నవంబరు 26: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలు నెరవేర్చాలని ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయిస్వా మి, ప్రధానకార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఎన్నికల్లో విజయం తర్వాత దాని ఊసే ఎత్తడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మొదలుకుని రాషా్ట్రన్ని పూర్తి గా కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పెడుతోందన్నారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే మోదీపై పోరాటం చేస్తానన్న జగన్‌మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడక పోవడం సిగ్గు చేటన్నారు. విభజనచట్టంలో ఉన్న హామీలను వెంటనే కేంద్రం అమలు చేయాలని కోరారు. అనంతపురం సెంట్రల్‌ యూనివర్సిటీకి నిధుల విడుదలలోనూ కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఎనిమిదేళ్లు కావస్తున్నా వర్సిటీ ప్రహరీ కూడా పూర్తి చేయలేకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు హనుమంతు, రమణయ్య, ఉమా మహేష్‌, వెంకట్‌ నాయక్‌, వినోద్‌, చంద్ర, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T23:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising