ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లులపై రగడ

ABN, First Publish Date - 2022-10-27T00:05:14+05:30

రుద్రంపేట పంచాయతీ సర్వసభ్య సమావేశంలో సర్పంచ, ఉప సర్పంచ వాగ్వాదానికి దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్వసభ్య సమావేశం రసాభాస

అనంతపురం రూరల్‌, అక్టోబరు 26: రుద్రంపేట పంచాయతీ సర్వసభ్య సమావేశంలో సర్పంచ, ఉప సర్పంచ వాగ్వాదానికి దిగారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒకటో సచివాలయంలో బుధవారం నిర్వహించిన పంచాయతీ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. సర్పంచు పద్మావతి, ఉపసర్పంచు నరేంద్రరెడ్డి గొడవకే సమావేశం పరిమితమైంది. అభివృద్ధి పనుల నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపులో ‘నువ్వు తినలేదా.. అంటే నువ్వు తినలేదా..’ అని ఎవరికి వారు ఎదుటి వారి అక్రమాలను బయట పెట్టారు. వార్డు సభ్యులు స్థానిక సమస్యలను ప్రస్థావిస్తున్నా పట్టించుకోలేదు. రెండేళ్ల కిందట చేసిన పనులకు బిల్లులు రాలేదని, రెండు మూడు నెలల కిందట జరిగిన పనులకు బిల్లులు చేసి ఇస్తున్నారని అధికారులు, సర్పంచుతో పలువురు వార్డు సభ్యులు వాదనకు దిగారు. వార్డులో అభివృద్ధి పనులు ఎవరు చేస్తున్నారో తమకు మాత్రం కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బిల్లుల అంశంపై గొడవ మొదలైంది. తమకు సంబంధం లేకుండా జరిగిన పనులకు తీర్మానం పుస్తకంలో తామెందుకు సంతకాలు పెట్టాలంటూ.. తీర్మానాల పుస్తకంలో సంతకాలు చేసిన పేపర్‌ను ఉప సర్పంచు చించేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేసి, సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత సర్పంచు కూడా వెళ్లిపోయారు.

Updated Date - 2022-10-27T00:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising