ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Geography: పోటీ పరీక్షల కోణంలో వ్యవసాయం ఇలా..!

ABN, First Publish Date - 2022-11-14T16:18:43+05:30

కూడు, గూడు, గుడ్డ... ఈ మూడూ మానవుడి ప్రస్థానంలో కీలకపాత్ర పోషించాయి. మొదటిదైన ఆహారం కోసం మానవుడు సాగించిన పోరాటంలో వ్యవసాయం కుదురుకున్న తీరును పోటీ పరీక్షల కోణంలో తెలుసుకుందాం.

వ్యవసాయం ఇలా..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూడు, గూడు, గుడ్డ... ఈ మూడూ మానవుడి ప్రస్థానంలో కీలకపాత్ర పోషించాయి. మొదటిదైన ఆహారం కోసం మానవుడు సాగించిన పోరాటంలో వ్యవసాయం కుదురుకున్న తీరును పోటీ పరీక్షల(Competitive Examinations) కోణంలో తెలుసుకుందాం.

  • మానవుడు సంచార జీవనం నుంచి స్థిరనివాస జీవనం ప్రారంభించిన సమయంలో పంటలు పండించడం అమలులోకి వచ్చింది.

  • ఉద్దేశపూర్వకంగా మొక్కలను మానవ అవసరాల కోసం సాగుచేయడాన్ని వ్యవసాయం అంటారు. ఇలా సాగుచేసే మొక్కలను పంటలు అంటారు.

  • ప్రపంచంలో మొట్టమొదట భూమిని దున్నిన గుర్తులు రాజస్థాన్‌లోని కాళీ బంగన్‌లో కనిపించాయి.

  • రష్యాకు చెందిన జన్యు శాస్త్రవేత్త ఎన్‌.ఐ.వావిలన్‌ ప్రకారం ప్రపంచంలో ఎనిమిది వ్యవసాయ ప్రాంతాలున్నాయి. మొక్కల జన్యు వైవిధ్యాన్ని బట్టి ఈ విభజన చేశాడు.

1) చైనీస్‌ కేంద్రం- సోయాబీన్స్‌, లెగ్యూమ్‌

2) హిందుస్థానీ కేంద్రం- వరి, చెరకు, మామిడి, అరటిపండు, మిరియాలు, కొబ్బరి, పనస, పత్తి

3) మధ్య ఆసియా- యాపిల్‌, ద్రాక్ష, క్యారెట్‌, పాలకూర

4) పశ్చిమ ఆసియా- గోధుమ, ద్రాక్ష, బార్లీ

5) అబిసీసియా- కాఫీ, బెండ, ఆవాలు

6) మధ్యదరా కేంద్రం- కాలీఫ్లవర్‌, క్యాబేజీ

7) మధ్య అమెరికా కేంద్రం- మిరప, పత్తి, మొక్కజొన్న, బీన్స్‌

8) దక్షిణ అమెరికా కేంద్రం- పైనాపిల్‌, బొప్పాయి, జీడిపప్పు

భారతదేశంలో మూడు రకాల వ్యవసాయ సీజన్లు ఉన్నాయి- 1) ఖరీఫ్‌ 2) రబీ 3) జైద్‌/ జియాద్‌.

ఖరీఫ్(జూన్‌-అక్టోబరు): నైరుతి రుతుపవనాల రాకతో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతుంది. విత్తనాలను జూన్‌, జూలై కాలాల్లో వేస్తారు. పంట కోసేకాలం సెప్టెంబరు నుంచి అక్టోబరు. ముఖ్యమైన పంటలు వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, పత్తి, జనుము, వేరుశనగ, పొగాకు చెరకు.

రబీ(అక్టోబరు-ఏప్రిల్‌): ఈశాన్య రుతుపవనాల రాకతో రబీ సీజన్‌ ప్రారంభమవుతుంది. ఈ పంటలకు పెరిగేటప్పుడు చల్లని వాతావరణం, పంట కోసేటప్పుడు వెచ్చని వాతావరణం కావాలి. విత్తనాలు జల్లే కాలం అక్టోబరు నుంచి డిసెంబరు. అలాగే పంట కోసే కాలం ఫిబ్రవరి - ఏప్రిల్‌. ముఖ్యమైన పంటలు గోధుమ, బార్లీ, పప్పు ధాన్యాలు.

జైద్‌/ జియాద్‌ పంటలు(ఏప్రిల్‌-జూన్‌): నీటిపారుదల వసతులు కల్పించడం ద్వారా కొన్ని పంటలను సంవత్సరం పొడవునా పండించవచ్చు. వీటిని జైద్‌/ జియాద్‌ పంటలు అంటారు. ఉదాహరణకు వరి, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, ఆకుకూరలు, కాయగూరలు. ఏప్రిల్‌, జూన్‌ నెలల్లో పండించే జైద్‌ పంటలు- కర్భూజ, కూకుంబర్‌, ఆకుకూరలు, కాయగూరలు.

భారతదేశంలో పంటలను మూడు రకాలుగా వర్గీకరించారు.

1) ఆహార పంటలు : వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, గోధుమ, బార్లీ

2) నగదు లేదా వాణిజ్య పంటలు : పత్తి, జనుము, పొగాకు, చెరకు

3) తోట పంటలు : తేయాకు, కాఫీ, రబ్బరు, కొబ్బరి

వ్యవసాయం - రకాలు : ఒక ప్రాంతం, శీతోష్ణస్థితి, భూసారం, నీటిపారుదల, సాంకేతిక పరిజ్ఞాన లభ్యత మొదలైన అంశాలపై వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పరిస్థితులు ప్రాంతీయంగా వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి. వ్యత్యాసాలను బట్టి వ్యవసాయాన్ని అయిదు రకాలుగా వర్గీకరించారు. అవి-

1) విస్తాపన వ్యవసాయం: ఆయనరేఖ ప్రాంతాల్లో ఈ వ్యవసాయం అమలులో ఉంది. దీనికి స్థలమార్పిడి/ సంచార వ్యవసాయం అని పేరుంది. ఇలాంటి వ్యవసాయం కొండ ప్రాంతాల్లో కనిపిస్తుంది. కొండ/ అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు చెట్లను నరికి వాటిని వ్యవసాయ భూములుగా మార్చి సాగు చేస్తారు. కొన్ని సంవత్సరాలకు ఆ భూమి సారాన్ని కోల్పోవడంతో పక్కన ఉన్న చెట్లను నరికి వాటిని కూడా వ్యవసాయ భూములుగా మారుస్తారు. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. దీనినే పోడు వ్యవసాయం అంటారు. ఈ పద్ధతిలో అడవుల క్షీణత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యవసాయాన్ని భారతదేశంలో వివిధ పేర్లతో పిలుస్తారు.

ఆంధ్ర/ తెలంగాణలో- పోడు వ్యవసాయం; ఒడిశా- ధీటి, పామదాచి, కోమన్‌, బ్రింగా; మధ్యప్రదేశ్‌- మషాన్‌, పెండా, బీర, దహియా; రాజస్థాన్‌- వాత్ర, వాత్రే; ఈశాన్య రాష్ట్రాలు- ఝాం; కేరళ- పోమన్‌; హిమాలయాలు- ఖిల్‌; పశ్చిమ కనుమలు- కుమారి. ప్రపంచ దేశాల్లో పోడు వ్యవసాయాన్ని వివిధ పేర్లతో పిలుస్తారు. వెనెజులా- కొనుక; బ్రెజిల్‌- రోకా; మధ్యఆఫ్రికా- మసోల్‌; శ్రీలంక- చీనా; మయన్మార్‌- టోంగ్యా; థాయ్‌లాండ్‌- తయారి; మలేషియా- లతాంగ్‌; ఇండోనేషియా- హుమా; వియత్నాం- లే; ఫిలిప్పీన్స్‌- కయింగిన్‌;

ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం: హరిత విప్లవ ప్రభావం వల్ల వరి ఉత్పత్తి మూడురెట్లు, గోధుమల ఉత్పత్తి 2.5, మొక్కజొన్న 3.5, జొన్న 5, సజ్జలు 5.5 రెట్లు పెరిగాయి. అయితే ఆహారేతర పంటలను నిర్లక్ష్యం చేశారు. హరిత విప్లవం ప్రధానంగా గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి అయిదు ఆహార పంటలకు మాత్రమే పరిమితమైంది. ముఖ్యంగా హరిత విప్లవ కాలంలో గోధుమపంట ఉత్పత్తి ప్రసిద్ధి పొందింది. అల్ప ఫలన కాలపు పంటలను ప్రవేశపెట్టడం ప్రారంభమైంది. నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా ఆధునిక సాంకేతిక పద్ధతులైన పంటల మార్పిడి, బహుళ పంటలు, నీటిపారుదల, రసాయనిక ఎరువులు, యంత్రాలు, పనిముట్లు, పంటల రక్షణ లాంటి చర్యలు చేపట్టారు. వ్యవసాయ పరపతిని పెంచారు. మద్దతు ధరలను ప్రకటించారు.

వ్యవసాయదారుల కోసం...

  • 1963లో జాతీయ విత్తన సంస్థ, జాతీయ సహకార అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.

  • 1965లో రాష్ట్రాల్లో వ్యవసాయాధార పారిశ్రామిక సంస్థలను నెలకొల్పారు.

  • 1965లో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)ను ఏర్పాటుచేశారు. 1963లో ఏర్పాటుచేసిన వ్యవసాయ రీఫైనాన్స్‌ అభివృద్ధి సంస్థ తరవాత కాలంలో నాబార్డ్‌గా మారింది.

  • ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల

  • ఆహార ధాన్యాల ఉత్పత్తి 1960-61 నాటికి 69 మిలియన్‌ టన్నులుండగా, 2014-15 నాటికి 252.7 మిలియన్‌ టన్నులకు పెరిగింది.

  • 1960-61 నుంచి 1973-74 వరకు వాణిజ్య పంటలపై హరిత విప్లవ ప్రభావం పెద్దగా లేదు. 1973-74 తరవాత వాణిజ్య పంటల్లో కొంత పెరుగుదల ఏర్పడింది.

  • ఆహార ధాన్యాల ఉత్పాదకత(కి.గ్రా/హె) 1960-61లో 710 ఉండగా 2011-12లో 2059గా ఉంది.

  • పంటల తీరులో మార్పు చోటు చేసుకుంది. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తృణ ధాన్యాల ప్రాధాన్యం పెరిగి, పప్పు ధాన్యాల ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. 1950-51లో మొత్తం ఉత్పత్తిలో వరి 48ు, గోధుమ 15ు, ముతక ధాన్యాలు 37ు ఉండగా, 2010-11లో వరి 43%, గోధుమ 38%, ముతక ధాన్యాలు 19%గా నమోదయ్యాయి.

  • నూతన వ్యవసాయ, సాంకేతిక పద్ధతుల వల్ల వాటి ఆధారిత పరిశ్రమలు వృద్ధి చెంది, ఉద్యోగిత పెరిగింది.

  • వ్యవసాయరంగ ఉత్పాదకత పెరగడం వల్ల వ్యవసాయదారుల ఆదాయాలు పెరిగాయి.

  • ఆహార ధాన్యాల మిగులు నిల్వల వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ జరిగి పేదరికం తగ్గి, ఆహార భద్రత ఏర్పడింది.

స్థిర వ్యవసాయం: స్థిర వ్యవసాయం, విస్తాపన వ్యవసాయానికి పూర్తిగా వ్యతిరేకం. ఈ పద్ధతిలో ఒకచోట స్థిర నివాసం ఏర్పర్చుకొని ఒకే భూమిలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. భూసారం తగ్గితే సారవంతం చేయడానికి కొంత భూ భాగాన్ని బీడుగా ఉంచి, కొన్ని సంవత్సరాల తరవాత తిరిగి సాగుచేస్తారు. ఈ వ్యవసాయం సాధారణంగా 10-15 సంవత్సరాల చక్రాన్ని కలిగి ఉంటుంది. అంటే అదే భూమి 7-19 సంవత్సరాల తరవాత తిరిగి వ్యవసాయానికి ఉపయోగించడానికి వీలుంటుంది.

విస్తృత వ్యవసాయం: ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమిలో ఎక్కువ పెట్టుబడితో చేసే వ్యవసాయాన్నే విస్తృత వ్యవసాయం అంటారు. ఈ పద్ధతిలో ఎక్కువమంది కూలీలతోపాటు యంత్రాలను కూడా ఉపయోగిస్తారు. ఈ రకం వ్యవసాయంలో సరాసరి దిగుబడి తక్కువ మోతాదులో ఉంటుంది. అమెరికా, కెనడా, రష్యా దేశాల్లో విస్తృత వ్యవసాయం అమలులో ఉంది.

సాంద్ర వ్యవసాయం: తక్కువ విస్తీర్ణంలో ఆధునిక పద్ధతిలో సాగుచేసి, ఎక్కువ దిగుబడి పొందడాన్ని సాంద్ర వ్యవసాయం అంటారు.

ఈరకం వ్యవసాయంలో సరాసరి దిగుబడి ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇలాంటి వ్యవసాయానికి జపాన్‌ ఉత్తమ ఉదాహరణ. మనదేశంలో కూడా గంగానది పరివాహకం, కృష్ణా, గోదావరి, మహానది, కావేరి డెల్టా ప్రాంతాలు ఈ రకానికి మంచి ఉదాహరణలుగా చెప్పవచ్చు.

మిశ్రమ వ్యవసాయం: ఈ విధానంలో వ్యవసాయ ఉత్పత్తులతోపాటు పశుపోషణ/ పౌలీ్ట్ర ఫామ్‌లు/ చేపల పెంపకం/ సెరీకల్చర్‌కు సంబంధించిన కార్యకలాపాలు చేపడతారు.

మొదటి హరిత విప్లవం(1966-69)

1947లో అఖండ భారతదేశం రెండుగా చీలినప్పుడు మనం 29ు భూ భాగాన్ని, 18ు జనాభాను కోల్పోయాం. 60ు గోధుమ, 40ు వరి పండించే ప్రాంతాలను కూడా కోల్పో యాం. దీంతో దేశంలో ఆహార కొరత బాగా ఏర్పడింది. ఈ సమయంలో 1956లో అమెరికాతో చేసుకున్న పిఎల్‌-480(పబ్లిక్‌ లా) ఒప్పందంలో భాగంగా గోధుమ, పాలపిండి దిగుమతి చేసింది.

భారతదేశం

1960: ఐఏడీపీ= ఇంటెన్సివ్‌ అగ్రికల్చర్‌ డిస్ట్రిక్స్‌ ప్రోగ్రామ్‌- సాంద్ర వ్యవసాయ జిల్లా పథకం ముఖ్యాంశాలు.

1) సాగునీటి వసతులను కల్పించడం

2) రసాయనిక, ఎరువుల వాడకం పెంచడం

3) క్రిమి సంహారక మందుల వాడకాన్ని పెంచడం

4) యంత్రాల వినియోగాన్ని పెంచడం

5) రైతులకు సబ్సిడీ రుణాలు అందించడం.

దీనినే ప్యాకేజీ ప్రోగ్రామ్‌ అని కూడా పిలుస్తారు.

  • 1959లో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి భారతదేశ ఆహ్వానం మేరకు ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు మనదేశంలో పర్యటించారు. వీరి సూచనల మేరకు సాంద్ర వ్యవసాయ జిల్లా పథకాన్ని ప్రారంభించారు.

  • ఫోర్డ్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఏర్పాటైన నిపుణుల బృందం చేసిన సూచనలతో భారతప్రభుత్వం 1960లో ఏడు రాష్ట్రాల్లో, ఏడు జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం(ఐఏడీపీ)ని ప్రారంభించింది.

  • దీనిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, బిహార్‌లోని షాహాబాద్‌, మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పూర్‌(ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌), తమిళనాడులోని తంజావూరు జిల్లాలను వరి ఉత్పత్తికి, పంజాబ్‌లోని లుథియానా, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లాలను గోధుమ ఉత్పత్తికి, రాజస్థాన్‌లోని పాలి జిల్లాను చిరుధాన్యాల ఉత్పత్తికి ఎంపిక చేశారు.

  • 1965లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని సాంద్ర వ్యవసాయ ప్రాంత పథకం(ఐఏఏపీ)గా 114 జిల్లాల్లో అమలు చేశారు.

  • మెక్సికో: ఈ సమయంలోనే మెక్సికోలోని రాక్‌ ఫెల్లర్‌ ఫౌండేషన్‌ సంస్థలో సభ్యుడైన నార్మన్‌ బోర్లాగ్‌ తన పరిశోధనల ద్వారా జన్యుపరమైన మారుక్షౌలతో గోధుమపంట పండే కాలాన్ని ఆరు నెలల నుంచి నాలుగు నెలలకు తగ్గించాడు. ఈ పరిశోధనను వామనీకరణ పద్ధతి అంటారు. ఈయన అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను రూపొందించాడు. ఆయన రూపొందించిన కొత్త గోధుమ వంగడాలు 1) లెర్మరోజో, మెయో, సోనారో-64.

  • ఫిలిప్పీన్స్‌: ఫోర్డ్‌ ఫౌండేషన్‌ సహకారంతో మనీలాలో ఏర్పడిన అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ‘ఇంటర్నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’(ఐఆర్‌ఆర్‌ఐ) పరిశోధనలు జరిపి అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను రూపొందించారు. వీరు రూపొందించిన కొత్త వరి వంగడాలు ఐఆర్‌-3, ఐఆర్‌-8.

  • 1965లో అప్పటి వ్యవసాయ మంత్రి సి.సుబ్రహ్మణ్యం మెక్సికో నుంచి బోర్లాగ్‌ సహకారంతో గోధుమ వంగడాలను, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం నుంచి అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను భారత్‌లోకి దిగుమతి చేయించాడు.

  • 1966లో ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో ఎం.ఎ్‌స.స్వామినాథన్‌ నేతృత్వంలో భారత్‌లో హరిత విప్లవం(1966-69) చేపట్టారు. సాంద్ర వ్యవసాయ ప్రాంత పథకానికి, మెక్సికో, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం నుంచి దిగుమతి చేసుకున్న అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను కలిపి ప్రవేశపెట్టడాన్ని హరిత విప్లవం అంటారు.

  • హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా అమెరికాకు చెందిన విలియం గాండ్‌ జర్మనీలోని ఒక సమావేశంలో మొదటిసారిగా ఉపయోగించాడు. హరిత విప్లవం వల్ల ప్రధానంగా ప్రయోజనం పొందిన పంట- గోధుమ, వరి. దీనివల్ల ప్రధానంగా ప్రయోజనం పొందిన కూరగాయలు- బంగాళదుంప/ఆలుగడ్డ. అలాగే వాణిజ్యపంటల్లో- పత్తి, నూనెగింజుల్లో వేరుశనగ, పొద్దుతిరుగుడు ప్రయోజనం పొందిన పంటలు.

  • ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్‌ బోర్లాగ్‌

  • భారతదేశంలో హరితవిప్లవ పితామహుడు ఎం.ఎ్‌స.స్వామినాథన్‌

  • ప్రపంచ వరి పరిశోధన కేంద్రం మనీలా(ఫిలిప్పీన్స్‌)

  • భారత వరి పరిశోధన కేంద్రం కటక్‌(ఒడిశా)

  • ఆంధ్రప్రదేశ్‌ వరి పరిశోధన కేంద్రం మార్టేరు(పశ్చిమగోదావరి).

-వి.వెంకట్‌రెడ్డి

సీనియర్‌ ఫ్యాకల్టీ

Updated Date - 2022-11-14T16:18:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising