ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS jobs Special: పోటీ పరీక్షలు ఏవైనా అగ్రికల్చర్‌పై..

ABN, First Publish Date - 2022-12-21T17:17:01+05:30

భారతదేశం ప్రధానంగా వ్యావసాయక దేశం. నేటికీ సుమారు 53 శాతం మంది జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా దానిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని

అగ్రికల్చర్‌పై..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఎస్‌పీఎస్సీ / పోలీసు పరీక్షల ప్రత్యేకం/ ఇండియన్‌ జాగ్రఫీ

భారతదేశం ప్రధానంగా వ్యావసాయక దేశం. నేటికీ సుమారు 53 శాతం మంది జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా దానిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ అదే ప్రధాన జీవనాధారం. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు ‘భారత వ్యవసాయ రంగం’పై దృష్టి సారించాలి. పోటీ పరీక్షలు ఏవైనా... ఈ అంశంపై ఒకటి లేదా రెండు ప్రశ్నలు కచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది.

వ్యవసాయం

శ్వేత విప్లవం (White Revolution)

వర్గీస్‌ కురియన్‌ను ‘శ్వేత విప్లవ’ పితామహుడిగా కీర్తిస్తారు. ఆపరేషన్‌ ఫ్లడ్‌ అనే కార్యక్రమం 1970లో ప్రారంభమైంది. గ్రామీణ ఉత్పత్తిదారులను పట్టణ వినియోగదారులతో అనుసంధానించడం దీని ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ప్రస్తుతం పాల ఉత్పత్తి మొత్తం 198.4 మిలియన్‌ టన్నులు. దేశంలో పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్‌(30519 టన్నులు), రాజస్థాన్‌(23668 టన్నులు), మధ్యప్రదేశ్‌(15911 టన్నులు), ఆంధ్రప్రదేశ్‌(15263 టన్నులు), తెలంగాణ(5590 టన్నులు) ప్రథమ స్థానాల్లో ఉన్నాయి. దేశంలో తక్కువ పాల ఉత్పత్తి కలిగిన రాష్ట్రం మిజోరాం (26 టన్నులు), తరవాతి స్థానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌(55 టన్నులు) ఉంది. దేశంలో అత్యధిక పాల ఉత్పత్తి కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం- జమ్మూ కశ్మీర్‌(2540 టన్నులు). దేశంలో అత్యల్ప పాల ఉత్పత్తి కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం- డామన్‌ డయ్యూ(1 టన్ను). దేశం మొత్తం తలసరి పాల వినియోగం రోజుకు 406 గ్రాములు. అత్యధిక తలసరి పాల వినియోగం కలిగిన రాష్ట్రాలు- పంజాబ్‌(1221 గ్రా/రోజుకు), హర్యానా(1118 గ్రా/రోజుకు). అత్యల్ప తలసరి పాల వినియోగం కలిగిన రాష్ట్రాలు- మిజోరాం(64 గ్రా/రోజుకు), అసోం(73 గ్రా/రోజుకు). ఆంధ్రప్రదేశ్‌లో తలసరి పాల వినియోగం 799 గ్రా/రోజుకు కాగా, తెలంగాణలో తలసరి పాల వినియోగం 410 గ్రా/రోజుకు. ప్రస్తుతం పాల ఉత్పత్తిలో 198.4 మిలియన్‌ టన్నులతో భారతదేశం మొదటి స్థానంలో, 97.7 మిలియన్‌ టన్నులతో అమెరికా ద్వితీయ స్థానంలో ఉన్నాయి. 0.41 మిలియన్‌ టన్నులతో శ్రీలంక ప్రపంచ పాల ఉత్పత్తిలో చివరి స్థానంలో ఉంది.

పశు సంపద (Animal Wealth)

భారతదేశంలో ప్రస్తుతం జీవ సంపద మొత్తం 538 మిలియన్లు. వీటిలో పశు సంపద-302.4 మిలియన్లు(ఆవులు-192.5మి., బర్రెలు-109.9 మి). ప్రపంచ పశు సంపదలో భారత్‌ది మొదటి స్థానం(302. 4 మిలియన్లు).

  • పశు సంపద అధికంగా ఉన్న రాష్ట్రాలు - ఉత్తప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌

  • ఆవులను అధికంగా కలిగిన రాష్ట్రాలు- ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌

  • ప్రపంచంలో ఉన్న మొత్తం గేదెలలో 57 శాతం భారతదేశంలో ఉన్నాయి.

  • కోళ్ల పెంపకం (Poultry)

  • ప్రస్తుతం దేశంలో వీటి ఉత్పత్తి సంఖ్య 851.8 మిలియన్లు

  • దేశంలో కోళ్లు అధికంగా ఉత్పత్తి అవుతున్న రాష్ట్రాలు - ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు

  • గొర్రెలు: వీటి మొత్తం సంఖ్య - 74.3 మిలియన్లు

  • భారతదేశంలో ముఖ్యమైన గొర్రెల జాతులు - మెరినో, అంగారా

  • మెరినో జాతి గొర్రెలు ఇచ్చే శ్రేష్టమైన ఉన్నిని జమ్మూ కశ్మీర్‌ మెహయిర్‌, హిమాలయ ప్రాంతంలో పస్మినా అని పిలుస్తారు.

  • భారత్‌లో గొర్రెలు అధికంగా ఉన్న రాష్ట్రాలు- రాజస్థాన్‌, కర్ణాటక

    మేకలు: మొత్తం సంఖ్య - 148.9 మిలియన్లు

  • మేకలు అధికంగా ఉన్న రాష్ట్రాలు - బిహార్‌, ఉత్తర ప్రదేశ్‌ పేదవాడి ఆవు - మేక

  • రాజస్థాన్‌లో గొర్రెలు పెంచేవారిని గుజ్జర్లు అంటారు.

  • హిమాచల్‌ ప్రదేశ్‌లో గొర్రెలు పెంచేవారిని గద్దీలు అంటారు

  • పందులు: మొత్తం సంఖ్య- 9.1 మిలియన్లు

నీలి విప్లవం (Blue Revolution)

  • చేపల పెంపకం - ‘పిసికల్చర్‌’. చేపల అధ్యయనాన్ని ‘ఇక్తియాలజీ’ అంటారు.

  • మనదేశ వాణిజ్యంలో మత్స్య పరిశ్రమ 7.56 శాతం ఆక్రమిస్తుంది.

  • ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో చైనాది తొలిస్థానం కాగా, రెండో స్థానంలో భారతదేశం ఉంది.

  • దేశంలో నదుల పరంగా 29,000 కి.మీ. చేపలు దొరికే ప్రాంతం ఉంది. సముద్ర పరంగా(తీర రేఖ)- 7516 కి.మీ.

  • దొరికే ప్రాంతం ఆధారంగా చేపలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..

1. మంచినీటి చేపలు - 104.36 లక్షల టన్నులు

2. సముద్ర చేపలు- 37.27 లక్షల టన్నులు

మొత్తం చేపల ఉత్పత్తి: 141. 63 లక్షల టన్నులు

  • మంచినీటి చేపల ఉత్పత్తిలో చివరి స్థానాలు: గోవా- 0.04 లక్షల టన్నులు, అరుణాచల్‌ ప్రదేశ్‌-0.05 లక్షల టన్నులు

  • సముద్ర చేపల ఉత్పత్తిలో తొలి మూడు స్థానాలు: గుజరాత్‌ - 7.1 లక్షల టన్నులు, తమిళనాడు - 5.83 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌- 5.63 లక్షల టన్నులు

  • సముద్ర చేపల ఉత్పత్తిలో అత్యల్పం: ఒడిశా-1.58 లక్షల టన్నులు, పశ్చిమ బెంగాల్‌- 1.63 లక్షల టన్నులు

  • మొత్తం చేపల ఉత్పత్తిలో తొలి రెండు స్థానాలు: పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌

  • చేపల ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఎక్కువగా గల రాష్ట్రం - కేరళ

  • చేపలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్న ఓడరేవు - విశాఖ ఓడరేవు

  • మన చేపలను ఎక్కువగా కొంటున్న దేశం - శ్రీలంక

  • 2004 నవంబరులో మెరైన్‌ ఫిషింగ్‌ పాలసీని ప్రకటించారు.

పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్‌(30519 టన్నులు), రాజస్థాన్‌(23668 టన్నులు), మధ్యప్రదేశ్‌(15911 టన్నులు), ఆంధ్రప్రదేశ్‌(15263 టన్నులు), తెలంగాణ(5590 టన్నులు) ప్రథమ స్థానాల్లో ఉన్నాయి.

-వి.వెంకట్‌రెడ్డి

సీనియర్ ఫ్యాకల్టీ

Updated Date - 2022-12-21T17:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising