Entrance Test: క్రాఫ్ట్స్ అండ్ డిజైనింగ్ కోర్సులు
ABN, First Publish Date - 2022-11-23T16:20:18+05:30
జైపూర్(Jaipur)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్(Indian Institute of Crafts and Design) (ఐఐసీడీ) - బీ డిజైన్, ఎం డిజైన్, ఎం ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
జైపూర్(Jaipur)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్(Indian Institute of Crafts and Design) (ఐఐసీడీ) - బీ డిజైన్, ఎం డిజైన్, ఎం ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. నిబంధనల మేరకు స్కాలర్‌షి్‌పలు అందిస్తారు. డిగ్రీలో మూడేళ్లు, పీజీలో ఏడాది కోర్సు పూర్తయ్యాక ఎనిమిది వారాల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్ ఇండియన్స్, సార్క్ దేశాల అభ్యర్థులు, ఇతర విదేశీ విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఎంట్రెన్స్ రాయనవసరం లేదు. వీరికి స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, డిజిటల్ పోర్ట్‌ఫోలియో, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
బీ డిజైన్: ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. ఇందులోనే ఏడాది వ్యవధిగల ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. ఏడాదికి రెండు చొప్పున మొత్తం ఎనిమిది సెమిస్టర్‌లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 180 సీట్లు ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/ పన్నెండో తరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఏడాది కోర్సు పూర్తయ్యాక డిప్లొమా, రెండేళ్ల తరవాత అడ్వాన్స్‌డ్ డిప్లొమా, మూడేళ్ల తరవాత బీ ఒకేషనల్ డిగ్రీతో ప్రోగ్రామ్ నుంచి వైదొలగే వీలుంది.
ఎం డిజైన్: ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్‌లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌లో 90 సీట్లు ఉన్నాయి. బీ డిజైన్/ బీఆర్క్/ బీఏ డిజైన్/ బీఎస్సీ డిజైన్/ బీ ఒకేషనల్ డిజైన్/ తత్సమాన కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎం ఒకేషనల్: దీనిని నాన్ డిజైన్ డిగ్రీ కోర్సులు చేసిన అభ్యర్థులకు ప్రత్యేకించారు. ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. ఇందులో ఏడాది వ్యవధిగల ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. మొత్తం ఆరు సెమిస్టర్‌లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌లో 90 సీట్లు ఉన్నాయి.
బోధనాంశాలు: డిగ్రీ ప్రోగ్రామ్‌లో క్రాఫ్ట్స్ అండ్ డిజైన్, స్కిల్స్ అండ్ అప్లికేషన్స్, హిస్టరీ ఆఫ్ క్రాఫ్ట్స్, మెటీరియల్స్ - సైన్స్, టూల్స్ - టెక్నిక్స్ - ప్రాసెస్, ఫీల్డ్ ఎక్స్‌పోజర్, కస్టమర్ - మార్కెట్ నీడ్స్, డిజైన్ ప్రాసెస్ తదితర అంశాలు బోధిస్తారు.
పీజీ ప్రోగ్రామ్‌లలో రిసెర్చ్, కాన్సెప్ట్, డిజైన్-సిస్టమ్స్ అండ్ సొల్యూషన్ థింకింగ్, అడ్వాన్స్ ఎక్స్‌ప్లొరేషన్ ఆఫ్ మెటీరియల్స్- డిజైన్ పాసిబులిటీస్, ఇన్నొవేషన్స్, బిజినెస్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్, సోషల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ లీడర్‌షిప్ అంశాలు వివరిస్తారు.
ఎంట్రెన్స్ టెస్ట్ వివరాలు: ఇందులో రెండు దశలు ఉంటాయి. మొదటిది జనరల్ అవేర్‌నెస్ - క్రియేటివిటీ అండ్ పర్సెప్షన్ టెస్ట్. రెండోది మెటీరియల్- కలర్స్ - కాన్సెప్ట్ టెస్ట్. ఇందులో పోర్ట్ ఫోలియో సబ్మిషన్ ఉంటుంది. ఇది పూర్తిగా అభ్యర్థి క్రియేటివ్ వర్క్‌కు సంబంధించింది. ఇందులో స్కెచింగ్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, ఫొటోగ్రఫీ, మోడల్స్, ఎక్స్‌ప్లొరేషన్ విత్ మెటీరియల్స్, క్రియేటివ్ రైటింగ్ తదితర అంశాలు ఉండేలా చూసుకోవాలి. అభ్యర్థులు పెన్స్, పెన్సిల్స్ (హెచ్‌బి, 2బి, 4బి, 6బి), సిజర్స్, స్కేల్, సెల్లో టేప్, పేపర్ కట్టర్, ఫెవీ స్టిక్, ఇరేజర్, కంపాస్, కలర్ పెన్సిల్స్, వాటర్ కలర్స్, బ్రష్‌లు వెంట తెచ్చుకోవాలి. తరవాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఆప్టిట్యూడ్ టు క్రాఫ్ట్స్, ఇంటెలిజెన్స్ కోషంట్, కమ్యూనికేషన్ ఎబిలిటీ, క్రాఫ్ట్స్ అండ్ డిజైన్‌కు సంబంధించిన జనరల్ అవేర్‌నెస్, పర్సనల్ అచీవ్‌మెంట్స్, కరిక్యులర్ యాక్టివిటీస్ ఆధారంగా అభ్యర్థుల ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. జనరల్ అవేర్‌నెస్ - క్రియేటివిటీ అండ్ పర్సెప్షన్ టెస్ట్‌కు 35 శాతం, మెటీరియల్ - కలర్స్ - కాన్సెప్ట్ టెస్ట్‌కు 45 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
డిగ్రీ, పీజీ స్పెషలైజేషన్‌లు
హార్డ్ మెటీరియల్ డిజైన్
సాఫ్ట్ మెటీరియల్ డిజైన్
ఫైర్డ్ మెటీరియల్ డిజైన్
ఫ్యాషన్ క్లాతింగ్ డిజైన్
జ్యువెలరీ డిజైన్
క్రాఫ్ట్స్ కమ్యూనికేషన్
దరఖాస్తు ఫీజు: ఇండియా సహా సార్క్ దేశాల అభ్యర్థులకు రూ.1,750; ఎన్‌ఆర్‌ఐలు సహా విదేశీ విద్యార్థులకు రూ.3,500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 జనవరి 21
అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడింగ్: 2023 జనవరి 27 నుంచి
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష కేంద్రం: హైదరాబాద్
ఎంట్రెన్ట్ టెస్ట్ తేదీ: 2023 ఫిబ్రవరి 12న
ఎన్‌ఆర్‌ఐ, విదేశీ విద్యార్థులు ఎస్‌ఓపీ, డిజిటల్ పోర్ట్‌ఫోలియో సబ్మిట్ చేయాల్సిన తేదీ: 2023 ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు
విదేశీ విద్యార్థులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు: 2023 ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 2023 ఫిబ్రవరి 27న
వెబ్‌సైట్: iicd.ac.in
Updated Date - 2022-11-23T16:20:20+05:30 IST