ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

District Education Department: ఇన్‌‘చార్జి’ తీసుకోనట్లే..!

ABN, First Publish Date - 2022-11-10T12:41:32+05:30

జిల్లా విద్యాశాఖ సమస్తం ఇన్‌చార్జిల మయంగా మారింది. చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్కూళ్లు.. ఇలా ఎన్నాళ్లు

ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు మండలాలు

అయినా పోస్టులు ఖాళీ

హైదరాబాద్‌ సిటీ: జిల్లా విద్యాశాఖ సమస్తం ఇన్‌చార్జిల మయంగా మారింది. చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిలతో నెట్టుకువస్తున్నారు. అయితే, కొందరికి ఇన్‌చార్జి పోస్టులు ఇచ్చినా ఆ అదనపు భారం మోయలేమంటూ విధుల్లో చేరడం లేదు. దీంతో జోన్లు, మండలాల పరిధిలో డిప్యూటీ డీఈఓలు, డీఐఓఎ్‌సల కొరత ఏర్పడింది.

ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ స్కూళ్లను నిత్యం డిప్యూటీ డీఈఓలు, ఐఓఎ్‌సలు తనిఖీ చేస్తూ ఉండాలి. విద్యాశాఖలో కొంతకాలంగా ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో సీనియర్లు పనిచేస్తున్న స్థానాలకే పరిమితమయ్యారు. జిల్లాలోని 16 మండలాల్లో 12 డిప్యూటీ డీఈఓ పోస్టులుండగా.. ప్రస్తుతం అందరూ ఇన్‌చార్జిలే ఉన్నారు. వీరితోపాటు 24 డిప్యూటీ ఐఓఎస్‌ (మండల విద్యాధికారి) పోస్టుల్లో 7 ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. పాలనా సంస్కరణలో భాగంగా ఈ ఏడాది జూన్‌ 30న ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలకు డిప్యూటీ డీఈఓలు, డిప్యూటీ ఐఓఎ్‌సలుగా బాధ్యతలు అప్పగించినా అందులో సగం మంది ఇప్పటివరకు జాయిన్‌ కాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

చాలామంది అనారోగ్య కారణాలతోపాటు ప్రస్తుత హెచ్‌ఎం విధులతోపాటు అదనపు బాధ్యతలు స్వీకరించేందుకు దూరంగా ఉండగా, మరికొందరు పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షక పోస్టుల్లో సంబంధిత హెచ్‌ఎంలు జాయిన్‌ కాలేదని తెలిసినా జిల్లా విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

ఉద్యోగ విరమణ చేస్తున్నప్పటికీ ..

పాఠశాలలను నిత్యం తనిఖీ చేస్తూ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు కృషి చేయాల్సిన మండల, జిల్లాస్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు భారంగా మారాయి. ఒక్కో హెచ్‌ఎంకు మూడు నుంచి నాలుగు మండలాలను అప్పగించడంతో విధి నిర్వహణతో వారు సతమతమవుతున్నారు. ఏటా ఆయా కేటగిరీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు పదుల సంఖ్యలో ఉద్యోగ విరమణ చేస్తున్నప్పటికీ వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో జిల్లా విద్యాశాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడంతోపాటు విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించలేని పరిస్థితి ఏర్పడింది.

‘ఉర్దూ’ పాఠం ఆగం..

సబ్టెక్ట్‌ టీచర్‌ లేక ఉర్దూ మీడియం విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. జిల్లాలోని 690 ప్రభుత్వ పాఠశాలల్లో 200 వరకు మిక్స్‌డ్‌ ఉర్దూ (తెలుగు, ఇంగ్లిష్‌ కలిపి) స్కూళ్లు ఉన్నాయి. 13 పూర్తి ఉర్దూ మీడియం పాఠశాలలు నడుస్తున్నాయి. చాలా చోట్ల సబ్జెక్టు టీచర్లు లేరు. పూర్తి ఉర్దూ మీడియం స్కూళ్లలో లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌, ఉర్దూ) టీచర్లే తప్ప.. సబ్జెక్టు (గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయా లాజికల్‌ సైన్స్‌, సోషల్‌) బోధించే నాథుడే కరువయ్యాడు. సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలోని నల్లగుట్ట (న్యూ) బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేవలం ఉర్దూ, ఇంగ్లిష్‌ ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా, సబ్జెక్టులు చెప్పేందుకు ఎవరూ లేరు. దీంతో లాంగ్వేజ్‌లు చెబుతున్న ఉపాధ్యాయులే అంతంతమాత్రంగా పాఠాలను బోధిస్తూ నెట్టుకొస్తున్నారు.

జీజీహెచ్‌ఎ్‌స హైదర్‌గూడ ఉర్దూలో 59 మంది విద్యార్థులకు ఇంగ్లిష్‌, సైన్స్‌ టీచర్‌ మాత్రమే ఉండగా.. ఇతర క్లాసులు చెప్పేవారు అందుబాటులో లేరు. దీంతో ఇక్కడ ఇంగ్లిష్‌ మీడియంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులే వారికి పాఠాలు చెబుతున్నారు. వీటితోపాటు పాటు కాచిగూడ, బహదూర్‌పురా, చార్మినార్‌, ఆసిఫ్‌ నగర్‌ ప్రాంతాల్లోని పలు పాఠశాలల్లో సైతం ప్రధాన సబ్జెక్టులను బోధించే ఉపాధ్యా యులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉర్దూ మీడియం పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేకపోయిన విషయం తెలిసినప్పటికీ జిల్లా విద్యాశాఖాధికారులు ప్రత్నామ్యాయ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

తగ్గిన బోధన సామర్థ్యాలు

ఆయా జోన్లు, మండలాలకు కేటాయించిన అధికారులు తమ విధులను చేపట్టేందుకు దూరంగా ఉండడంతో పాఠశాలల్లో బోధన సామర్థ్యాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన తనిఖీల లోపంతోనే జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-11-10T12:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising