ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Osmania Universityలో ఈవెనింగ్‌ ఎంబీఏ

ABN, First Publish Date - 2022-11-11T13:37:53+05:30

ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ - ఎంబీఏ ఈవెనింగ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంబీఏ(టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌), ఎంబీఏ పార్ట్‌ టైం(MBA parttime) ప్రోగ్రామ్‌లు

ఈవెనింగ్‌ ఎంబీఏ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ - ఎంబీఏ ఈవెనింగ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంబీఏ(టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌), ఎంబీఏ పార్ట్‌ టైం(MBA parttime) ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహిస్తోంది. టీఎస్‌ ఐసెట్‌ 2022 అర్హత పొందిన అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. వీరికి కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. టీఎస్‌ ఐసెట్‌ 2022 రాయని అభ్యర్థులు, రాసినప్పటికీ అర్హత పొందని వారు వర్సిటీ నిర్వహించే ఓయూ ఎంబీఏ సెట్‌ 2022 రాయాల్సి ఉంటుంది.

ప్రోగ్రామ్‌ల వివరాలు: ఎంబీఏ(టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌) ఈవెనింగ్‌ ప్రోగ్రామ్‌: దీని వ్యవధి రెండేళ్లు.

ఎంబీఏ (పార్ట్‌ టైం) ఈవెనింగ్‌ ప్రోగ్రామ్‌: దీని వ్యవధి మూడేళ్లు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌/మేనేజీరియల్‌/అడ్మినిస్ట్రేటివ్‌/ ఇంజనీరింగ్‌/ డిఫెన్స్‌ విభాగాల్లో కనీసం రెండేళ్ల ప్రొఫెషనల్‌ అనుభవం ఉండాలి. అభ్యర్థులు తాము పనిచేస్తున్న సంస్థ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ను సబ్మిట్‌ చేయాలి.

ఓయూ ఎంబీఏ సెట్‌ 2022 వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌లో బిజినెస్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ ఆఫైర్స్‌ అంశాలనుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. రెండో పార్ట్‌లో రెండు సెక్షన్‌లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో న్యూమరికల్‌ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు; రెండో సెక్షన్‌లో జనరల్‌ ఇంగ్లీష్‌ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద బ్లూ/బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌తో గుర్తించాలి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం గంటన్నర. ఎగ్జామ్‌ సిలబస్‌ కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: నవంబరు 25

ఓయూ ఎంబీఏ సెట్‌ 2022 తేదీ: డిసెంబరు 11

వెబ్‌సైట్‌: http://ouadmissions.com/

Updated Date - 2022-11-11T13:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising