ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

FDDI: ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌ కోర్సులు

ABN, First Publish Date - 2022-12-24T15:17:20+05:30

కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ‘ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ)’ (Footwear Design and Development Institute)-బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ

ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌ కోర్సులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ‘ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ)’ (Footwear Design and Development Institute)-బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ (Notification) విడుదల చేసింది. బ్యాచిలర్‌ డిగ్రీలో బీ డిజైన్‌, బీబీఏ; మాస్టర్‌ డిగ్రీలో ఎం డిజైన్‌, ఎంబీఏ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఆలిండియా సెలెక్షన్‌ టెస్ట్‌(ఏఐఎస్‌టీ)2023 స్కోర్‌, కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. హైదరాబాద్‌, చెన్నై, చింద్వారా, చండీగఢ్‌, అంకలేశ్వర్‌, నోయిడా, ఫుర్సత్‌గంజ్‌, గుణ, జోధ్‌పూర్‌, పట్నా, కోల్‌కతా, రోహ్‌తక్‌ క్యాంప్‌సలలో ఈ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నారు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీ డిజైన్‌): ఈ ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, లెదర్‌-లైఫ్‌ స్టయిల్‌-ప్రొడక్ట్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ విభాగాలు ఎంచుకోవచ్చు.

  1. ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ విభాగానికి సంబంధించి హైదరాబాద్‌, నోయిడా క్యాంప్‌సలలో ఒక్కోదానిలో 80 సీట్లు; మిగిలిన అన్ని క్యాంప్‌సలలో ఒక్కోదానిలో 60 సీట్లు ఉన్నాయి. లెదర్‌-లైఫ్‌ స్టయిల్‌-ప్రొడక్ట్‌ డిజైన్‌ విభాగానికి సంబంధించి హైదరాబాద్‌, నోయిడా, కోల్‌కతా క్యాంప్‌సలలో ఒక్కోదానిలో 60 సీట్లు ఉన్నాయి. ఫ్యాషన్‌ డిజైన్‌ విభాగానికి సంబంధించి హైదరాబాద్‌, నోయిడా క్యాంప్‌సలలో ఒక్కోదానిలో 80 సీట్లు; గుణ మినహా అన్ని క్యాంపస్‌లలో ఒక్కోదానిలో 60 సీట్లు ఉన్నాయి.

బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ): రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చండైజ్‌ విభాగంలో ఈ ప్రోగ్రామ్‌ చేయవచ్చు. దీని వ్యవధి మూడేళ్లు, ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. హైదరాబాద్‌, నోయిడా, పట్నా, చండీగఢ్‌ క్యాంప్‌సలలో ఒక్కోదానిలో 60 సీట్లు ఉన్నాయి.

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎం డిజైన్‌): ఈ ప్రోగ్రామ్‌ స్పెషలైజేషన్‌ ‘ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌’. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. చెన్నై, నోయిడా క్యాంప్‌సలలో ఒక్కోదానిలో 60 సీట్లు ఉన్నాయి.

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ): ఈ ప్రోగ్రామ్‌ స్పెషలైజేషన్‌ రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చండైజ్‌. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. హైదరాబాద్‌, నోయిడా, పట్నా, చండీగఢ్‌, చింద్వారా క్యాంప్‌సలలో ఒక్కోదానిలో 60 సీట్లు ఉన్నాయి.

అర్హతలు: బీ డిజైన్‌, బీబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం అయిదు సబ్జెక్టులతో నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులు, పదోతరగతి తరవాత ఏఐసీటీఈ గుర్తింపు పొందిన మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసినవారు, ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.

  • ఎం డిజైన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఫుట్‌వేర్‌/ లెదర్‌ గూడ్స్‌/ డిజైన్‌/ ఫ్యాషన్‌/ ఫైన్‌ ఆర్ట్స్‌/ ఆర్కిటెక్చర్‌/ ఇంజనీరింగ్‌/ ప్రొడక్షన్‌/ టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. ఎంబీఏ ప్రోగ్రామ్‌నకు ఏదేని డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్నవారు కూడా అర్హులే. వీరు 2023 సెప్టెంబరు 30 నాటికి డిగ్రీ సర్టిఫికెట్‌లు సబ్మిట్‌ చేయాలి. అభ్యర్థులకు ఇంగ్లీష్‌ చదవడం, రాయడం, మాట్లాడడంతోపాటు అందులో మంచి ప్రావీణ్యం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు.

ఏఐఎస్‌టీ 2023 వివరాలు: ఇది పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌(పీబీటీ). ప్రశ్నలను ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. మొత్తం మార్కులు 200.

  • బీ డిజైన్‌, బీబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లో మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25; వెర్బల్‌ ఎబిలిటీ కింద కాంప్రహెన్షన్‌ నుంచి 10, గ్రామర్‌ నుంచి 30; జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 35 ప్రశ్నలు ఇస్తారు. వీటికి ఒక్కోదానికి ఒక మార్కు ఉంటుంది. బిజినెస్‌ ఆప్టిట్యూడ్‌, డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ అంశాల నుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. వీటికి ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు నిర్దేశించారు.

  • ఎం డిజైన్‌, ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే ఎగ్జామ్‌లో మొత్తం 175 ప్రశ్నలు ఇస్తారు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ గ్రామర్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ అంశాల నుంచి ఒక్కోదానిలో 50 ప్రశ్నలు ఇస్తారు. వీటికి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ600; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300

దరఖాస్తుకు చివరి తేదీ: 2023 ఏప్రిల్‌ 30

ఎడిటింగ్‌ విండో ఓపెన్‌: 2023 మే 1, 2

అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: జూన్‌ 5 నుంచి

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం

ఏఐఎస్‌టీ 2023 తేదీ: 2023 జూన్‌ 18న

అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల: 2023 జూన్‌ 30న

కౌన్సెలింగ్‌: జూలై రెండు, మూడు వారాల్లో

ప్రోగ్రామ్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 2023 జూలై 31

వెబ్‌సైట్‌: www.fddiindia.com

Updated Date - 2022-12-24T15:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising