Name change: ఇక.. వైఎస్సార్ హెల్త్ వర్సిటీ
ABN, First Publish Date - 2022-11-01T16:18:38+05:30
ప్రజలు ఏమనుకున్నా, వారు డిమాండ్ ఎలా ఉన్నా, ఎన్ని రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసినా మేం చేసేది చేసేస్తాం అన్నట్టుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పంతమే
ఎన్టీఆర్ పేరు తీసేసిన ప్రభుత్వం..
గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
గత నెల 21నే అసెంబ్లీలో బిల్లు
ఆ రోజే ఆమోదించిన ఉభయ సభలు
వారం క్రితమే బిల్లుకు గవర్నర్ ఆమోదం
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఏమనుకున్నా, వారు డిమాండ్ ఎలా ఉన్నా, ఎన్ని రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసినా మేం చేసేది చేసేస్తాం అన్నట్టుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పంతమే నెగ్గించుకుంది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా చేసిన మార్పునకు అధికారిక ముద్ర పడింది. ఈమేరకు సోమవారం రాత్రి ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గెజిట్‌ను విడుదల చేశారు. గత నెల 21న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చారు. అప్పటికి రెండు రోజుల ముందే వర్సిటీ పేరు మార్పునకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వర్సిటీ పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకించారు. శాసనభలోనే సవరణ బిల్లును చించేశారు. నాటకీయ పరిణామాల మధ్య ప్రభుత్వం ఉభయ సభల్లో వర్సిటీ పేరు మార్పు బిల్లును ఆమోదించుకుంది. గతవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ బిల్లును ఆమోదించి, ప్రభుత్వానికి పంపించారు.
Updated Date - 2022-11-01T16:20:26+05:30 IST