ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tspsc: గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రిపరేషన్‌ ఇలా..!

ABN, First Publish Date - 2022-11-14T15:33:32+05:30

తెలంగాణలో తొలిసారిగా నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌(Group-1 Prelims) ప్రాథమిక ‘కీ’ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(Telangana Public Service Commission)(టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. చాలా మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత

ప్రిపరేషన్‌ ఇలా..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణలో తొలిసారిగా నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌(Group-1 Prelims) ప్రాథమిక ‘కీ’ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(Telangana Public Service Commission)(టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. చాలా మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారనే విషయం అర్థమవుతోంది. వీరంతా తక్షణమే తమ ప్రిపరేషన్‌ను ఆరంభించాల్సిన సమయం ఆసన్నమైంది. వాస్తవానికి రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షల్లో అతి ఉన్నతమైనది గ్రూప్‌-1 మెయిన్స్‌ . దాదాపు మూడు లక్షల మందిలో 1:50 శాతం చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే 503 ఉద్యోగాలకు 25,000 వేల మంది తమ భవితవ్యాన్ని నిర్ధారించుకోబోతున్నారు.

ఈ నేపథ్యంలో మెయిన్స్‌ పరీక్ష విధానం ఎలా ఉంటుంది? ప్రిపరేషన్‌ ఎలా ఉండాలి? సక్సెస్‌ వెనుక ఉండే రహస్యాలు ఏమిటి?... మొదలైన అంశాలను చూద్దాం. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా జనరల్‌ కేటగిరీ, రిజర్వేషన్ల ప్రాతిపదికగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెయిన్స్‌ ప్రశ్న పత్రాల సమాధానాలు పరీక్షించే ముందు జనరల్‌ ఇంగ్లీ్‌షలో అర్హత సాధించాలి.

జనరల్‌ ఇంగ్లీష్‌ అర్హత పరీక్ష: 10వ తరగతి స్థాయి ఆంగ్ల పరిజ్ఞానం పరీక్ష ఇది. గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఆంగ్లభాషలో ఉన్న సాధారణ పరిజ్ఞానాన్ని ఈ పరీక్ష ద్వారా పరిశీలిస్తారు. అయితే ఈ మార్కులు మెయిన్స్‌లో కలపరు. కాబట్టి కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ పరీక్షలో అడిగే అంశాలు కింది విధంగా ఉంటాయి.

1. Spotting Errors Spelling Punctuation

2. Fill in the blanks Prepositions, Conjuctions, Verb, tenses

3. Re Writing sentences Active and Passive Voice, Direct& Reported Speech, Usage of Vocabulary

4. Jumble Sentences

5. Comprehension

6. Precis Writing

7. Expension

8. Letter Writing

ప్రస్తుత మెయిన్స్‌లో మొత్తం 6 పేపర్లు ఉన్నాయి. పేపర్‌కు 150 చొప్పున 900 మార్కులను కేటాయించారు. ప్రశ్న పత్రం పూర్తిగా వ్యాసరూప సమాధానాల(డిస్ర్కిప్టివ్‌)తో ఉంటుంది.

జనరల్‌ ఎస్సే: ఇది మొదటి పేపర్‌. మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో..సమకాలీన సామాజిక అంశాలు - సామాజిక సమస్యలు మొదటి అంశంగా ; ఆ తరవాత ఆర్థిక వృద్ధి, న్యాయ అంశాలు ఉంటాయి. సెక్షన్‌-2లో.. భారత రాజకీయ పరిణామాలు మొదటి అంశంగా; భారతీయ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం రెండో అంశంగా ఉంటాయి. అదేవిధంగా సెక్షన్‌-3లో.. శాస్త్ర, సాంకేతిక రంగ పరిణామాలు మొదటి అంశంగా; విద్య, మానవ వనరుల అభివృద్ధి రెండో అంశంగా ఉంటాయి.

దిన పత్రికలు, పక్ష పత్రికల్లోని సమకాలీన అంశాలను విస్తృతంగా చదవడం ద్వారా అభ్యర్థులు వ్యాసాలు రాసే నైపుణ్యాలు పెంచుకోవాలి. ‘యోజన’, ‘తెలంగాణ’, ‘వీక్షణం’ లాంటి పత్రికల్లో వచ్చే వ్యాసాల పరిశీలన ‘జనరల్‌ ఎస్సే’ పేపర్‌ కోసం బాగా ఉపయోగపడతాయి.

చరిత్ర- సంస్కృతి- భూగోళం: ఈ పేపర్‌లో భారతదేశ, తెలంగాణ చరిత్ర- సంస్కృతి-వారసత్వం అంశాల సిలబస్‌ ప్రధానంగా ఉంది. తొలి భారతీయ నాగరికతలు, బౌద్ధ-జైన మతాలు, మౌర్య, గుప్త, శాతవాహనుల నుంచి..ఇస్లాం భారతీయ సమ్మేళనం, ఆధునిక భారతదేశ చరిత్ర, బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమాలు, భారత స్వాతంత్రోద్యమ దశల వరకు సిలబ్‌సలో ఉంది.

అదేవిధంగా ప్రాచీన- మధ్యయుగ-ఆధునిక తెలంగాణ సమాజం; చరిత్ర, సంస్కృతి, వారసత్వం, కళలు, నిర్మాణాలు, సాహిత్యం, ఉద్యమాలు ఈ పేపర్‌లో అంతర్భాగం. భారతదేశ, తెలంగాణ జాగ్రఫీ ప్రత్యేక అధ్యాయాలుగా ఉన్నాయి. ఈ పేపర్‌ కోసం ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. స్వీయ నోట్స్‌ తయారు చేసుకోవడం అవసరం.

భారతీయ సమాజం- రాజ్యాంగం- పాలన: సామాజిక శాస్త్రాలు ప్రధానంగా భారతీయ సమాజ లక్షణాలు, కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, తెగ, మతం, భాష, పట్టణీకరణ, భిన్నత్వంలో ఏకత్వ సాధన, సామాజిక వెలివేత-సమ్మిళనం మొదలైన అంశాలు, సామాజిక అసమానతలు, పరిష్కారాలు, ప్రధానంగా తెలంగాణ సమాజ నిర్మాణం, ప్రభుత్వ విధానాలు, పథకాలు సిలబ్‌సలో అంతర్భాగం. ఈ అంశాల కోసం ప్రామాణిక పుస్తకాలతోపాటు స్వీయ పరిశీలన, రెగ్యులర్‌గా దిన పత్రికల పఠనం, సమాచార సేకరణ చేయగలగాలి.

భారత రాజ్యాంగ పరిణామక్రమం - రాజ్యాంగ లక్షణాలు, సమకాలీన సమాజంలో పాలన సమస్యలు, ఈ-గవర్నెన్స్‌ పై ప్రత్యేక అంశాలు సిలబ్‌సలో 5 చాప్టర్లలో పొందుపరిచారు. అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇటీవల కాలంలో భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ- గవర్నెన్స్‌పై ప్రశ్నల స్థాయిలో కఠినత్వం ఉంటోంది.

ఆర్థిక వ్యవస్థ- అభివృద్ధి: ఈ పేపర్‌లో భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై సిలబస్‌ ఇచ్చారు. భారత జాతీయ ఆదాయం, ఆదాయ ఆధారిత పేదరికం, ద్రవ్యం, బ్యాంకింగ్‌, ఆర్‌బీఐ, పబ్లిక్‌ ఫైనాన్స్‌, ప్రణాళికలు- నీతి ఆయోగ్‌, ఎల్‌పీజీ తదితర అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి.. హైదరాబాద్‌ రాజ్యం నుంచి ప్రస్తుత తెలంగాణ వరకు జరిగిన ఆర్థిక పరిణామాలు, మానవ వనరులు, భూ సంస్కరణలు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగంపై సిలబస్‌ రూపొందించారు. అభివృద్ధి అంశాలను పర్యావరణ కోణంలో వివరించే ఐదు చాప్టర్లు ఈ సిలబ్‌సలో ఉన్నాయి. ఆర్థిక- సామాజిక సర్వే రిపోర్టులు, బడ్జెట్‌ కేటాయింపులను అభ్యర్థులు అవగతం చేసుకోవాలి. ఆర్థిక-సామాజిక-పర్యావరణ సమస్యలపై స్వీయ పరిశీలన సామర్థ్యాలను సంతరించుకోవాలి.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ - దత్తాంశ విశ్లేషణ: నిత్యం దినపత్రికల అధ్యయనం, సైన్స్‌ సంబంధిత సమాచార సేకరణ, విశ్లేషణను అభ్యర్థులు చేయగలగాలి. ఇటీవలి కాలంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై ప్రశ్నల కాఠిన్యత స్థాయి పెరుగుతోంది. అదేవిధంగా శాస్త్ర విజ్ఞాన అమలులో నూతన ధోరణులపై ఐదు చాప్టర్లు సిలబ్‌సలో అంతర్భాగంగా ఉన్నాయి. పంటల శాస్త్రం, బయోటెక్నాలజీ, ఫుడ్‌సేఫ్టీ, ఇన్‌ఫెక్షన్స్‌, వ్యాక్సిన్స్‌ మొదలైన అంశాలపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టి అధ్యయనం చేయాలి. దత్తాంశ విశ్లేషణ, సమస్యల సాధనపై ఐదు చాప్టర్లు ఉన్నాయి. వీటిపై సివిల్స్‌ పూర్వ ప్రశ్న పత్రాల పరిశీలన అవసరం.

తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం: ఈ పేపర్‌లో..తెలంగాణ ఉద్యమ మూడు దశలు(తెలంగాణ భావన, సమీకరణ దశ, రాష్ట్ర ఆవిర్భావ దశ) చేర్చారు. ఈ మూడింటికి సంబంధించి మొత్తం 15 చాప్టర్లు ఉన్నాయి. ముల్కీ ఉద్యమ నేపథ్యం నుంచి వివిధ ఒప్పందాల ఉల్లంఘన వరకు, రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలన్నింటిని విశ్లేషణాత్మకంగా అభ్యర్థులు అధ్యయనం చేసి స్వీయ నోట్స్‌ను సిద్ధం చేసుకోవాలి.

-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌,

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌

Updated Date - 2022-11-14T16:22:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising