ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KNRUHS: మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2022-11-28T17:25:04+05:30

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (Kaloji Narayana Rao University of Health Sciences) (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌)- ‘మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(Master of Public Health) (ఎంపీహెచ్‌)’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌

హెల్త్‌ నోటిఫికేషన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (Kaloji Narayana Rao University of Health Sciences) (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌)- ‘మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(Master of Public Health) (ఎంపీహెచ్‌)’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంట్రెన్స్‌ టెస్ట్‌, కౌన్సెలింగ్‌ ద్వారా హైదరాబాద్‌- రాజేంద్రనగర్‌లోని అనుబంధ కళాశాల ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(ఐఐపీహెచ్‌)’ అందించే ఈ కోర్సుకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రోగ్రామ్‌ వివరాలు: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌ వ్యవధి ఆర్నెల్లు. రెండో సెమిస్టర్‌లో రెండు నెలల ఇంటర్న్‌షిప్‌(ఫీల్డ్‌ ట్రెయినింగ్‌), నాలుగో సెమిస్టర్‌లో డిజర్టేషన్‌ ఉంటాయి.

సీట్ల వివరాలు: హైదరాబాద్‌- రాజేంద్రనగర్‌లోని అనుబంధ కళాశాల ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(ఐఐపీహెచ్‌)’లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద 20 సీట్లు, మేనేజ్‌మెంట్‌ కోటా కింద 16 సీట్లు, విదేశీయుల కోటా కింద 4 సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. మెడికల్‌/ పారామెడికల్‌ డిగ్రీలు ఉన్న విదేశీ అభ్యర్థులు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ నుంచి; ఇతర డిగ్రీలు ఉన్నవారు ఏపీ/తెలంగాణ ఉన్నత విద్యా మండలి లేదా న్యూఢిల్లీలోని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ నుంచి ఈక్వివేలెన్స్‌ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేయాలి. ఈ కోర్సులో చేరేందుకు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు. అభ్యర్థులందరికీ మెడికల్‌ ఫిట్‌నెస్‌ తప్పనిసరి.

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ : ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ (ఆన్‌లైన్‌) ఎంట్రెన్స్‌ టెస్ట్‌. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే ఇస్తారు. ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌లో కమ్యూనికబుల్‌ డిసీజెస్‌, నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌, మెటర్నిటీ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌, ఫ్యామిలీ ప్లానింగ్‌ అండ్‌ కాంట్రసెప్షన్‌ మెజర్స్‌, ప్రైమరీ హెల్త్‌ కేర్‌, ఫ్యామిలీ అండ్‌ బిహేవియరల్‌ సైన్సెస్‌ అంశాల నుంచి ఒక్కోదానిలో అయిదు చొప్పున మొత్తం 30 ప్రశ్నలు ఇస్తారు. రెండో పార్ట్‌లో జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 20; బేసిక్‌ స్టాటిస్టిక్స్‌, ఎపిడిమియాలజీ, డెమోగ్రఫీ, శానిటేషన్‌ అండ్‌ హైజీన్‌, నేషనల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ హెల్త్‌ ఏజెన్సీస్‌, పాపులేషన్‌ పాలసీ అంశాల నుంచి ఒక్కోదానిలో అయిదు; న్యూట్రిషన్‌, ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ అంశాల నుంచి ఒక్కోదానిలో 10 చొప్పున మొత్తం 70 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. నెగెటివ్‌ మార్కులు లేవు. పరీక్ష సమయం గంటన్నర. ఈ టెస్ట్‌లో అర్హత సాధించాలంటే కనీసం 40 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం మార్కులు చాలు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.4,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.3,000; విదేశీయులు, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.6,000

వెరిఫికేషన్‌ ఫీజు: ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.5,000; విదేశీయులకు రూ.7,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 19

దరఖాస్తు ప్రింట్‌ కాపీ స్వయంగా/ పోస్ట్‌ ద్వారా చేరేందుకు చివరి తేదీ: నవంబరు 19

హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: నవంబరు 24

పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌

ఎంట్రెన్స్‌ టెస్ట్‌: నవంబరు 27న

చిరునామా: కన్వీనర్‌, పీజీ అడ్మిషన్స్‌ కమిటీ, కేఎన్‌ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, వరంగల్‌.

వెబ్‌సైట్‌: www.knruhs.telangana.gov.in

Updated Date - 2022-11-28T17:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising