Tiruchirappalli నిట్‌లో ఎంఎస్ రిసెర్చ్
ABN, First Publish Date - 2022-11-10T14:08:00+05:30
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institute of Technology) (ఎన్‌ఐటీటీ)- ఎంఎస్ రిసెర్చ్ 2023 జనవరి సెషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institute of Technology) (ఎన్‌ఐటీటీ)- ఎంఎస్ రిసెర్చ్ 2023 జనవరి సెషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఫుల్ టైం - ప్రాజెక్ట్, పార్ట్ టైం - స్పాన్సర్డ్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుల స్ర్కీనింగ్, ఇంటర్వ్యూ, కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఒక సెమిస్టర్‌లో కోర్సు వర్క్, మిగిలిన మూడు సెమిస్టర్లలో ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల పాటు స్టయిపెండ్ ఇస్తారు.
విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఫిజిక్స్(నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు. ఏఎంఐఈ/ఏఎంఐఐఎం పూర్తిచేసినవారు కూడా అర్హులే. ఫుల్ టైం ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందాలంటే సంస్థ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్‌కు ఎంపికై ఉండాలి. నిట్ తిరుచిరాపల్లి సహా ఆర్ అండ్ డీ ల్యాబ్స్, ప్రభుత్వ/ప్రైవేట్/ఎంఎన్‌సీ తదితర సంస్థల్లో పనిచేస్తున్నవారు పార్ట్ టైం ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. వీరు స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: నవంబరు 30
వెబ్‌సైట్: www.nitt.edu
Updated Date - 2022-11-10T14:10:02+05:30 IST