ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Notification: ఎన్‌సీసీఎస్‌లో పీహెచ్‌డీ

ABN, First Publish Date - 2022-11-14T14:56:24+05:30

పుణెలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్స్‌(National Center for Cell Science) (ఎన్‌సీసీఎస్‌) - పీహెచ్‌డీ 2023 మార్చి సెషన్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల(Release of notification) చేసింది. ఇది అయిదేళ్ల వ్యవధి గల ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌

ఎన్‌సీసీఎస్‌లో పీహెచ్‌డీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణెలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్స్‌(National Center for Cell Science) (ఎన్‌సీసీఎస్‌) - పీహెచ్‌డీ 2023 మార్చి సెషన్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల(Release of notification) చేసింది. ఇది అయిదేళ్ల వ్యవధి గల ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తారు. రోజుకు రూ.100లు చెల్లించాల్సి ఉంటుంది. జేఆర్‌ఎఫ్‌ అర్హత/ జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ స్కోర్‌ను పరిశీలించి షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు.

రిసెర్చ్‌ విభాగాలు: బయాలజీ ఆఫ్‌ క్యాన్సర్‌ అండ్‌ క్రానిక్‌ డిసీజెస్‌, పాథోజెనిసిస్‌ అండ్‌ సెల్యులార్‌ రెస్పాన్స్‌, మేక్రోమాలిక్యులార్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్‌, సెల్‌ ఆర్గనైజేషన్‌ అండ్‌ ఫంక్షన్‌, జినోమ్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ రెగ్యులేషన్‌, మైక్రోబయల్‌ ఎకాలజీ, రెగ్యులేటరీ ఆర్‌ఎన్‌ఏ అండ్‌ జీన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, న్యూరోసైన్స్‌, స్టెమ్‌ సెల్స్‌ అండ్‌ రిజనరేషన్‌

అర్హత: సంబంధిత సైన్స్‌ స్పెషలైజేషన్‌తో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(మాస్టర్స్‌ డిగ్రీ) పూర్తిచేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. మోడరన్‌ బయాలజీకి సంబంధించిన పరిశోధనలపై ఆసక్తి ఉండాలి. సీఎస్‌ఐఆర్‌/ యూజీసీ/ డీబీటీ/ ఐసీఎంఆర్‌/ బీఐఎన్‌సీ/ డీఎస్‌టీ - ఇన్‌స్పయిర్‌ నుంచి వ్యాలిడ్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) అర్హత ఉండాలి. ఎన్‌సీబీఎస్‌/ టీఐఎఫ్‌ఆర్‌ నిర్వహించిన జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ 2021 డిసెంబరు ఎగ్జామ్‌లో అర్హత సాధించినవారు జేఆర్‌ఎఫ్‌ అర్హత లేకున్నా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరికి ఎన్‌సీసీఎస్‌ ఫెలోషిప్‌ అందిస్తుంది. సీఎస్‌ఐఆర్‌ / యూజీసీ నుంచి లెక్చరర్‌షిప్‌ అర్హత మాత్రమే పొందినవారు దరఖాస్తుకు అనర్హులు.

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 6

ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: డిసెంబరు 26

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు: 2023 జనవరి 17, 18, 19

ఇంటర్వ్యూ ఫలితాలు విడుదల: 2023 జనవరి 23

అడ్మిషన్‌ తేదీ: 2023 మార్చి 1

వెబ్‌సైట్‌: nccs.res.in/

Updated Date - 2022-11-14T14:56:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising