Notification: నిట్ వరంగల్‌లో పీహెచ్‌డీ
ABN, First Publish Date - 2022-12-03T15:56:35+05:30
వరంగల్ (Warangal)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(National Institute of Technology) (నిట్)- పీహెచ్‌డీ డిసెంబరు సెషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫుల్ టైం, పార్ట్ టైం విధానాలు అందుబాటులో
వరంగల్ (Warangal)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(National Institute of Technology) (నిట్)- పీహెచ్‌డీ డిసెంబరు సెషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫుల్ టైం, పార్ట్ టైం విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 13 కేటగిరీల్లో అడ్మిషన్స్ నిర్వహిస్తారు. ఫుల్ టైం ప్రోగ్రామ్‌లో ఇన్‌స్టిట్యూట్ ఫెలోషిప్, ప్రభుత్వ ఫెలోషిప్, ప్రాజెక్ట్ ఫెలోస్, స్పాన్సర్డ్, ఎక్స్‌టర్నల్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ తదితర కేటగిరీలు; పార్ట్ టైం ప్రోగ్రామ్‌లో పర్మినెంట్ ఫ్యాకల్టీ కేటగిరీలు ఉన్నాయి. అకడమిక్ ప్రతిభ, అనుభవం, జాతీయ పరీక్ష స్కోర్ (గేట్/ నెట్/ ఇన్‌స్పయిర్) ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ ప్రకారం అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఫుల్ టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. డాక్టోరల్ కమిటీ అనుమతి మేరకు మరో ఏడాది పొడిగించే వీలుంది.
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ / ఎంఎస్ - రిసెర్చ్ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ, పీజీ స్థాయుల్లో ప్రథమశ్రేణి మార్కులు ఉండాలి. ఇంజనీరింగ్ విభాగాలకు కనీసం 75 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ పూర్తిచేసి గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉన్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సె్‌సకు ఏదేని డిగ్రీతోపాటు పీజీ(ఇంగ్లీష్); మేనేజ్‌మెంట్ విభాగానికి ఫుల్ టైం ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. విభాగాన్ని అనుసరించి గేట్/ జెస్ట్/ యూజీసీ నెట్/ సీఎ్‌సఐఆర్ నెట్/ ఇన్‌స్పయిర్/ డీబీటీ జేఆర్‌ఎఫ్/ ఐసీఎంఆర్/ ఐడీఆర్‌బీటీ/ క్యాట్/ జీమ్యాట్ అర్హత ఉండాలి. పార్ట్ టైం ప్రోగ్రామ్‌లో చేరేవారికి ఈ అర్హత తప్పనిసరి కాదు. నిట్ వరంగల్ సహా ఇతర ప్రభుత్వ / ప్రైవేట్ అకడమిక్ సంస్థల్లోని లెక్చరర్‌లు/ ప్రొఫెసర్‌లు, పీఎ్‌సయూలలో పనిచేస్తున్నవారు, ప్రముఖ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ సంస్థలు/ లేబరేటరీల ఉద్యోగులు పార్ట్ టైం ప్రోగ్రామ్‌నకు అప్లయ్ చేసుకోవచ్చు. వీరికి నిబంధనల మేరకు కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి. నిట్ వరంగల్ ఫ్యాకల్టీ మెంబర్లకు రాత పరీక్ష నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1600; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 4
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి, పన్నెండోతరగతి, డిగ్రీ సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; కులం, ఆదాయం ధృవీకరణ పత్రాలు; ఎంప్లాయర్ నుంచి అనుమతి పత్రం/ రిలీవింగ్ సర్టిఫికెట్; గేట్/ నెట్/క్యాట్/ జీమ్యాట్ స్కోర్ కార్డ్; అభ్యర్థి ఫొటో; స్టేట్‌మెంట్ ఆఫ్ ప్రపోజల్/ రిసెర్చ్ ప్రపోజల్; లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్
రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ విడుదల: డిసెంబరు 12
రాత పరీక్ష, ఇంటర్వ్యూలు: డిసెంబరు 20 నుంచి 24 వరకు
విభాగాలవారీగా ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ విడుదల: డిసెంబరు 28న
డాక్యుమెంట్స్ అప్‌లోడింగ్: 2023 జనవరి 2, 3
ఫిజికల్ రిపోర్టింగ్: 2023 జనవరి 4, 5
అభ్యర్థులకు గైడ్/ సూపర్‌వైజర్ అలాట్‌మెంట్: 2023 జనవరి 6 నుంచి 9 వరకు
వెబ్‌సైట్: admissions.nitw.ac.in
Updated Date - 2022-12-03T15:56:36+05:30 IST