New Delhi: ఐఎస్‌టీడీలో పీజీ డిప్లొమా
ABN, First Publish Date - 2022-11-18T11:50:23+05:30
న్యూఢిల్లీలోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెయినింగ్ అండ్ డెవలప్‌మెంట్ (Indian Society for Training and Development) (ఐఎస్‌టీడీ) - పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రెయినింగ్ అండ్ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది
న్యూఢిల్లీలోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెయినింగ్ అండ్ డెవలప్‌మెంట్ (Indian Society for Training and Development) (ఐఎస్‌టీడీ) - పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రెయినింగ్ అండ్ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది 18 నెలల వ్యవధి గల కరస్పాండెన్స్ ప్రోగ్రామ్. ఇందులో హ్యూమన్ రిసోర్స్ డెవల్‌పమెంట్‌కు సంబంధించిన అంశాలు బోధిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 12 సబ్జెక్ట్‌లు, మూడు నెలల వ్యవధి గల ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్ ఉంటాయి. మొదటి పది సబ్జ్జెక్టులు పూర్తిచేసిన అభ్యర్థులకు డిప్లొమా ఇన్ ట్రెయినింగ్ అండ్ డెవల్‌పమెంట్‌ను ప్రదానం చేస్తారు. బ్యాంకులు, బిజినెస్ సంబంధిత సంస్థలు, అడ్మినిస్ట్రేషన్ విభాగాలు, అగ్రికల్చర్- హెల్త్-ఎడ్యుకేషన్ విభాగాలు, డిఫెన్స్ ఫోర్సెస్, సోషల్ సెక్టార్-వాలంటరీ సంస్థలు, కన్సల్టెన్సీలలో పనిచేస్తున్న హెచ్‌ఆర్‌డీ ఆఫీసర్స్, ట్రెయినింగ్ ప్రొఫెషనల్స్, లైన్ మేనేజర్స్, ప్రొఫెషనల్స్‌కు ఈ కోర్సు ప్రయోజనకరంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొన్ననాటి నుంచి నాలుగేళ్లలోపు ప్రోగ్రామ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఏటా రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రామ్‌నకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది.
ప్రోగ్రామ్ వివరాలు: ఇందులో మూడు సెమిస్టర్‌లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్‌లో నాలుగు సబ్జెక్ట్‌లు ఉంటాయి. మొదటి సెమిస్టర్‌లో బిజినెస్ స్ట్రాటజీ అండ్ హెచ్‌ఆర్‌డీ, ఇన్‌స్ట్రక్షనల్ డిజైన్, ట్రెయినింగ్ మెథడ్స్ - కాగ్నిటివ్, ట్రెయినింగ్ మెథడ్స్ - ఎక్స్‌పీరియెన్షల్; రెండో సెమిస్టర్‌లో ఫెసిలిటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ అండ్ ప్రజంటేషన్ స్కిల్స్, ట్రెయినింగ్ మెజర్‌మెంట్ అండ్ ఎవల్యూషన్, మేనేజింగ్ ట్రెయినింగ్ ప్రాసెస్; మూడో సెమిస్టర్‌లో డేటా అనలిటిక్స్, ఇన్నొవేషన్ అండ్ ఛేంజ్ మేనేజ్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ ఎల్ అండ్ డీ, ఎలక్టివ్ సబ్జెక్ట్(టాలెంట్ మేనేజ్‌మెంట్, డెవల్‌పమెంట్ సెంటర్ మేనేజ్‌మెంట్, రిసెర్చ్ మెథడాలజీ) పేపర్లు ఉంటాయి. వీటికి సంబంధించిన రీడింగ్ మెటీరియల్, ఈ-జర్నల్ అందిస్తారు. వారాంతాల్లో ఆన్‌లైన్ సెషన్స్ ఉంటాయి. సంస్థకు చెందిన ప్రొఫెషనల్స్ మెంటార్లుగా వ్యవహరిస్తారు. మొదటి రెండు సెమిస్టర్‌లు పూర్తయ్యాక మెంటార్ ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ చివరలో ప్రొక్టోర్డ్ ఆన్‌లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ప్రోగ్రామ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఏడాదిపాటు సంస్థలో ఉచితంగా మెంబర్‌షిప్ ఇస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. బీఈ/ బీటెక్, ఎంబీబీఎస్, సీఏఐబీ, ఏసీఏ, ఏఐసీడబ్ల్యుఏ, ఎంఈడీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారు; మెడికల్, ఇంజనీరింగ్, ఐటీ, మార్కెటింగ్, ఫైనాన్స్, అకౌంట్స్, పబ్లిక్ రిలేషన్స్ తదితర విభాగాల్లో పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. సాయుధ దళాల ఉద్యోగులు, మాజీ సైనిక అధికారులు, పారా మిలిటరీ దళాల అభ్యర్థులు, సీనియర్ సిటిజన్స్ కూడా అర్హులే. అనుభవం ఉండాల్సిన అవసరం లేదు.
ముఖ్య సమాచారం
ప్రోగ్రామ్ ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.50,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.45,000; సాయుధ దళాల ఉద్యోగులు, మాజీ సైనిక అధికారులు, పారా మిలిటరీ దళాల అభ్యర్థులు, సీనియర్ సిటిజన్స్ రూ.30,000 చెల్లించాల్సి ఉంటుంది. 18 శాతం జీఎస్‌టీ అదనం. ఇన్‌స్టాల్‌మెంట్‌లలో చెల్లించే అవకాశం ఉంది.
దరఖాస్తు ఫీజు: రూ.1500+18 శాతం జీఎ్‌సటీ
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 జనవరి సెషన్‌కు డిసెంబరు 15; 2023 జూలై సెషన్‌కు 2023 మే 30
ప్రోగ్రామ్ ప్రారంభం: 2023 జనవరి 1 నుంచి
వెబ్‌సైట్: www.istd.in
Updated Date - 2022-11-18T11:50:26+05:30 IST