applications: నీలిట్‌లో పీజీ డిప్లొమా
ABN, First Publish Date - 2022-11-09T15:29:07+05:30
కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(National Institute of Electronics and Information Technology)(నీలిట్) - పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటొమేషన్ సిస్టం డిజైన్, పీజీ డిప్లొమా ఇన్ డేటా
కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(National Institute of Electronics and Information Technology)(నీలిట్) - పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటొమేషన్ సిస్టం డిజైన్, పీజీ డిప్లొమా ఇన్ డేటా అనలిటిక్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి 24 వారాలు. థియరీ తరగతులు, ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. నవంబరు 28 నుంచి ప్రోగ్రామ్‌లు ప్రారంభమౌతాయి. అకడమిక్ మెరిట్, కౌన్సెలింగ్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. ఒక్కో ప్రోగ్రామ్‌లో 50 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లు పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో సహకారం అందిస్తారు.
పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటొమేషన్ సిస్టం డిజైన్
ఈ ప్రోగ్రామ్‌ను బ్లెండెడ్(ఆన్‌లైన్ + క్యాంప్‌స)మోడ్‌లో నిర్వహిస్తారు. మొదటి ఎనిమిది వారాలు ఆన్‌లైన్ సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి పన్నెండున్నర వరకు సెషన్స్ నిర్వహిస్తారు. 2023 జనవరి 23 నుంచి పన్నెండు వారాలపాటు క్యాంపస్ తరగతులు ఉంటాయి. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు థియరీ, ల్యాబ్ తరగతులు ఉంటాయి. 2023 ఏప్రిల్ 17 నుంచి నాలుగు వారాలపాటు ప్రాజెక్ట్ వర్క్(క్యాంపస్/ ఇండస్ట్రీ/ ఇంటర్న్‌షిప్/ హోం) ఉంటుంది
ప్రోగ్రామ్‌లో భాగంగా మెజర్‌మెంట్స్ విత్ ఇండస్ట్రియల్ ఫీల్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్, పీసీ బేస్డ్ డీఏక్యూ సిస్టమ్స్(డీఏఎస్), ప్రోగ్రామబుల్ ఆటొమేషన్ కంట్రోలర్స్(పీఏసీ), పీఎల్‌సీ అండ్ పీఐడీ కంట్రోలర్స్, ఇండస్ట్రియల్ డేటా కమ్యూనికేషన్(ఐడీసీ), స్కాడా/ హెచ్‌ఎంఐ సిస్టం డెవల్‌పమెంట్, డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టం(డీసీఎస్), ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అనే మాడ్యూల్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ మొత్తానికి 30 క్రెడిట్స్ నిర్దేశించారు.
అర్హత: (బీఈ/ బీటెక్)(ఎలక్ట్రికల్/ ఈఈఈ/ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ మెకట్రానిక్స్/ కెమికల్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 మే 5 నాటికి ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసినవారు కూడా అర్హులే.
ప్రోగ్రామ్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.59,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.6,000
కౌన్సెలింగ్, అడ్మిషన్స్: ఆన్‌లైన్ పార్ట్‌కు నవంబరు 28; ఆఫ్‌లైన్ పార్ట్‌కు 2023 జనవరి 23
పీజీ డిప్లొమా ఇన్ డేటా అనలిటిక్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
ఈ ప్రోగ్రామ్‌ను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు. ఇందులో లీనక్స్ ఓఎస్, పైథాన్ ప్రోగ్రామింగ్, స్టాటిస్టికల్/ మేథమెటికల్ ఫౌండేషన్ - డేటా సైన్స్, బిగ్ డేటా - డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అనే మాడ్యూల్స్‌తోపాటు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. మొత్తం 16 క్రెడిట్స్ నిర్దేశించారు. ప్రతి రోజూ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు థియరీ తరగతులు; మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ప్రాక్టికల్ (ప్రాక్టీస్) సెషన్స్ ఉంటాయి.
అర్హత: బీఎస్సీ(ఐటీ/కంప్యూటర్ సైన్స్/ఎలకా్ట్రనిక్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/మేథమెటిక్స్/స్టాటిస్టిక్స్)/బీఈ/ బీటెక్/బీసీఏ/మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. మామూలు డిగ్రీతోపాటు పీజీడీసీఏ/నీలిట్ నుంచి ఎ లేదా బి లెవెల్ కోర్సు పూర్తిచేసినవారు కూడా అర్హులే.
ప్రోగ్రామ్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.63,400; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5,000 (కోర్సు పూర్తయ్యాక ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు)
కౌన్సెలింగ్, అడ్మిషన్స్: నవంబరు 22
ముఖ్య సమాచారం
రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: నవంబరు 21
వెబ్‌సైట్: www.calicut.nielit.in
Updated Date - 2022-11-09T15:29:09+05:30 IST