ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Admissions: హైదరాబాద్‌ ఐఐఐటీలో పీహెచ్‌‌డీ

ABN, First Publish Date - 2022-11-17T14:01:48+05:30

గచ్చిబౌలీలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(International Institute of Information Technology (ఐఐఐటీ) - పీహెచ్‌డీ వింటర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

పీహెచ్‌‌డీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గచ్చిబౌలీలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(International Institute of Information Technology (ఐఐఐటీ) - పీహెచ్‌డీ వింటర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఫుల్‌ టైం, పార్ట్‌ టైం కేటగిరీలలో అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. అకడమిక్‌ ప్రతిభ, ఇతర అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు టెక్నికల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు.

అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ/ ఎంఏ మేథ్స్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిసెర్చ్‌ పబ్లికేషన్స్‌ ఉన్నవారికి, రిసెర్చ్‌ ఓరియంటెడ్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌లు పూర్తిచేసినవారికి, ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్స్‌/ ఇండస్ట్రీలలో ప్రొఫెషనల్‌ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

స్టయిపెండ్‌

  • ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌లో చేరిన అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి రూ.35,000 వరకు స్టయిపెండ్‌ చెల్లిస్తారు. కాన్ఫరెన్స్‌లలో రిసెర్చ్‌ వర్క్‌ ప్రజంటేషన్‌ కోసం ట్రావెల్‌ సపోర్ట్‌ అందిస్తారు.

  • సంస్థ అర్హులైన అభ్యర్థులకు రిపెల్‌ ఐఐఐటీహెచ్‌ బ్లాక్‌చెయిన్‌ పీహెచ్‌డీ ఫెలోషిప్‌, కేసీఐఎస్‌ ఫెలోషి్‌పలను అందిస్తుంది. ఈ స్కీంల కింద ఎంపికైనవారికి నాలుగేళ్లు/ థీసిస్‌ సబ్మిట్‌ చేసేవరకు నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

  • గూగుల్‌, టీసీఎస్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలు అందించే ఫెలోషి్‌పలను అనుమతిస్తారు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.2,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 15

ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ విడుదల: నవంబరు 21

ఇంటర్వ్యూలు: డిసెబరు 6, 7

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: డిసెంబరు 12

ప్రోగ్రామ్‌ ప్రారంభం: 2023 జనవరి 3

వెబ్‌సైట్‌: iiit.ac.in

Updated Date - 2022-11-17T14:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising