ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana ‘వ్యవసాయ’ వర్సిటీల్లో సెకండ్‌ కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2022-12-14T16:18:18+05:30

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (Prof. Jayashankar Telangana State Agricultural University) (పీజేటీఎస్‌ఏయూ), పీవీ నరసింహా రావు (PV Narasimha Rao) తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ

సెకండ్‌ కౌన్సెలింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొత్తం సీట్లు 173

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (Prof. Jayashankar Telangana State Agricultural University) (పీజేటీఎస్‌ఏయూ), పీవీ నరసింహా రావు (PV Narasimha Rao) తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌ఆర్‌టీవీయూ), సిద్దిపేట్‌ - ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ(Konda Laxman Telangana State Horticultural University)(ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) ఉమ్మడిగా సెకండ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. దీని ద్వారా బైపీసీ స్ట్రీం కింద బీఎస్సీ ఆనర్స్‌ (అగ్రికల్చర్‌/ కమ్యూనిటీ సైన్స్‌/ హార్టికల్చర్‌), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ ప్రోగ్రామ్‌లలో మిగిలిన సీట్లు భర్తీచేయనున్నారు. మొత్తం 173 సీట్లు ఉన్నాయి. టీఎస్‌ ఎంసెట్‌ 2022 ర్యాంక్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.

కౌన్సెలింగ్‌ సమాచారం

  • ఫార్మర్స్‌ కోటా కింద ప్రవేశం పొందాలంటే అభ్యర్థులు వ్యవసాయ కుటుంబానికి చెందినవారై ఉండాలి. తల్లిదండ్రులకు గానీ, అభ్యర్థి పేరు మీద గానీ కనీసం ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉండాలి. కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి.

  • ఇప్పటికే అడ్మిషన్‌ పొంది కాలేజ్‌/కోర్సు మారదలచుకున్నవారు కూడా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు.

  • ఫస్ట్‌ కౌన్సెలింగ్‌లో సీటు రానివారు; వచ్చినా అడ్మిషన్‌ తీసుకోనివారు/ అడ్మిషన్‌ క్యాన్సిల్‌ అయినవారు; ఫస్ట్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కానివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

  • కౌన్సెలింగ్‌ సమయానికి ఏర్పడిన ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రోగ్రామ్‌ ఫీజు: పీజేటీఎస్‌ఏయూ కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్‌(అగ్రికల్చర్‌/ కమ్యూనిటీ సైన్స్‌) ప్రోగ్రామ్‌లకు ఒక్కో సెమిస్టర్‌కు రూ.39,000. పీవీఎన్‌ఆర్‌టీవీయూ కళాశాలల్లో బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ ప్రోగ్రామ్‌నకు ఏడాదికి రూ.55,800; బీఎఫ్‌ఎస్సీ ప్రోగ్రామ్‌నకు సెమిస్టర్‌కు రూ.43,290. ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్‌ హార్టికల్చర్‌ ప్రోగ్రామ్‌నకు సెమిస్టర్‌కు రూ.47,090

కళాశాలలు - సీట్లు

అగ్రికల్చరల్‌ కళాశాలలు: రాజేంద్రనగర్‌లో 28, అశ్వారావుపేటలో 9, జగిత్యాలలో 4, పాలెంలో 9, వరంగల్‌లో 16, సిరిసిల్లలో 5 చొప్పున మొత్తం 71 సీట్లు ఉన్నాయి.

వెటర్నరీ సైన్స్‌ కళాశాలలు: రాజేంద్రనగర్‌లో 16, జగిత్యాలలో 10, వరంగల్‌లో 12 చొప్పున మొత్తం 38 సీట్లు ఉన్నాయి.

ఫిషరీ సైన్స్‌ కళాశాలలు: పెబ్బేరులో 7, ముతుకూరులో 10 చొప్పున మొత్తం 17 సీట్లు ఉన్నాయి.

హార్టికల్చర్‌ కళాశాలలు: రాజేంద్రనగర్‌లో 19, మోజర్లలో 15 చొప్పున మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి.

హైదరాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ సైన్స్‌లో 13 సీట్లు ఉన్నాయి.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: టీఎస్‌ ఎంసెట్‌ 2022లో 166-2600 మధ్య ర్యాంక్‌ సాధించినవారికి డిసెంబరు 16న; 2601-4600 మధ్య ర్యాంక్‌ సాధించినవారికి డిసెంబరు 17న; 4601-7099 మధ్య ర్యాంక్‌ సాధించినవారికి డిసెంబరు 19న; 7107-9993 మధ్య ర్యాంక్‌ సాధించినవారికి డిసెంబరు 20న కౌన్సెలింగ్‌ ఉంటుంది. నాన్‌ రూరల్‌/ రూరల్‌/ నాన్‌ ఫార్మర్స్‌/ఫార్మర్స్‌ కోటా సీట్లు భర్తీ చేస్తారు. అన్ని కేటగిరీల అభ్యర్థులకూ ఈ షెడ్యూల్‌ వర్తిస్తుంది.

10030-12969 మధ్య ర్యాంక్‌ సాధించిన బీసీ-ఎ అభ్యర్థులకు, 13087-18876 మధ్య ర్యాంక్‌ సాధించిన బీసీ-సి అభ్యర్థులకు, 11283-17946 మధ్య ర్యాంక్‌ సాధించిన బీసీ-ఇ అభ్యర్థులకు డిసెంబరు 20న ఫార్మర్స్‌ కోటా కౌన్సెలింగ్‌ ఉంటుంది.

ముఖ్య సమాచారం

అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన పత్రాలు: ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కాపీ, పదోతరగతి సర్టిఫికెట్‌, ఇంటర్‌ మార్కుల పత్రాలు, టీఎస్‌ ఎంసెట్‌ 2022 ర్యాంక్‌ కార్డ్‌, ఆరు నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్‌లు, అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ సర్టిఫికెట్‌లు, కులం - ఆదాయం - వైకల్యం ధ్రువీకరణ పత్రాలు; ఇప్పటికే అడ్మిషన్‌ పొందినవారైతే అడ్మిషన్‌ లెటర్‌, కాలేజ్‌ ఫీ రిసీట్‌, జాయినింగ్‌ సర్టిఫికెట్‌

కౌన్సెలింగ్‌ సెంటర్‌: హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని పీజేటీఎస్‌ఏయూ ఆడిటోరియం

వెబ్‌సైట్‌: www.pjtsau.edu.in

Updated Date - 2022-12-14T16:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising