కొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
ABN, First Publish Date - 2022-09-26T22:35:35+05:30
సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ(Sri Konda Laxman Telangana State Horticultural University) (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) - ‘డిప్లొమా ఇన్ హార్టికల్చర్’ ప్రోగ్రామ్‌లో
సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ(Sri Konda Laxman Telangana State Horticultural University) (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) - ‘డిప్లొమా ఇన్ హార్టికల్చర్’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ ఇస్తారు. పాలిసెట్ (అగ్రికల్చర్ స్ట్రీం) 2022 ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 200 సీట్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు 60 శాతం సీట్లు ప్రత్యేకించారు. ప్రోగ్రామ్‌ను ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు.
పాలిటెక్నిక్ కళాశాలలు - సీట్లు
యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లు: ఆదిలాబాద్; రామగిరిఖిల్లా, పెద్దపల్లి (ఒక్కో కాలేజీలో 40 చొప్పున రెంటిలో కలిపి 80 సీట్లు ఉన్నాయి.)
అనుబంధ పాలిటెక్నిక్‌లు: నల్లగొండ జిల్లా - మర్రిగూడలోని గ్రామభారతి హార్టికల్చరల్ పాలిటెక్నిక్, సూర్యాపేట జిల్లా - గడ్డిపల్లిలోని గంట గోపాల్ రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్, మహబూబాబాద్ జిల్లా - తొర్రూర్‌లోని విశ్వధరణి హార్టికల్చర్ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 40 సీట్లు ఉన్నాయి.
అర్హత: బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ - తెలంగాణ/ సీబీఎ్‌సఈ/ ఐసీఎస్‌ఈ/ ఎన్‌ఐఓఎస్/ టీఓఎ్‌సఎస్ నుంచి సైన్స్ ఒక సబ్జెక్ట్‌గా పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్ ఆపై చదివినవారు దరఖాస్తుకు అనర్హులు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1100; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 22
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి సర్టిఫికెట్, పాలిసెట్ 2022 ర్యాంక్ కార్డ్, నాలుగు నుంచి పదోతరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, కులం - ఆదాయం - వైకల్యం - ఎన్‌సీసీ - స్పోర్ట్స్ సంబంధిత ధ్రువీకరణ పత్రాలు
చిరునామా: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ములుగు మండలం, సిద్దిపేట జిల్లా - 502279
వెబ్‌సైట్: www.skltshu.ac.in
Updated Date - 2022-09-26T22:35:35+05:30 IST