ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Schedule: జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

ABN, First Publish Date - 2022-12-23T11:28:27+05:30

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ (JEE Advanced Exam Schedule) ఖరారైంది. వచ్చే ఏడాది జూన్‌ 4వ తేదీనఈ పరీక్షను నిర్వహించనున్నట్టు ఐఐటీ

జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ (JEE Advanced Exam Schedule) ఖరారైంది. వచ్చే ఏడాది జూన్‌ 4వ తేదీనఈ పరీక్షను నిర్వహించనున్నట్టు ఐఐటీ గువాహటి వెల్లడించింది. ఈ మేరకు అధికారులు గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ (IIT)ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్‌ కోర్సు (Engineering course)ల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్స్‌(JEE Mains)లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులకు మే 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులైతే ఏప్రిల్‌ 24 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మే 29 నుంచి జూన్‌ 4 వరకు అడ్మిట్‌కార్డ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జూన్‌ 18వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా, జేఈఈ మెయిన్‌ పరీక్ష- 2023 జనవరి 24 నుంచి 31 మధ్య జరగనుండగా రెండో సెషన్‌ను ఏప్రిల్‌ 6 నుంచి 12వ తేదీల మధ్య నిర్వహించనున్నారు.

Updated Date - 2022-12-23T11:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising