PM Modi: బీజేపీ కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తిన మోదీ...రాత్రివేళ గాంధీనగర్ కార్యాలయానికి వచ్చి భేటీ
ABN, First Publish Date - 2022-11-21T07:19:09+05:30
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం రాత్రి బీజేపీ కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తారు....
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం రాత్రి బీజేపీ కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆదివారం గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం రాత్రి గాంధీనగర్(Gandhinagar) లోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని(BJP Headquarters) సందర్శించి బీజేపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు.(BJP Party Workers) ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటనతో బీజేపీ కార్యకర్తలు ఆశ్యర్యానికి గురై ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడారు. పార్టీ కోసం దశాబ్ధాలుగా పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తలకు, మోదీకి మధ్య అర్దరాత్రి పార్టీ కార్యాలయంలోనే సమావేశం జరిగింది.
కార్యకర్తల గురించి మోదీ ఆరా
మోదీ స్వగ్రామంలో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కార్యకర్తలు రాత్రి దాకా పనిచేస్తున్నపుడు వారికి ఆహారం అందిస్తున్నారా అని మోదీ అడిగారు. కొంతమంది పాత బీజేపీ కార్యకర్తల పేర్లను మోదీ గుర్తుచేసుకొని వారితో తనకున్న మధురమైన జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకున్నారని ఒక యువ కార్యకర్త చెప్పారు.
ముగ్ధులైన కార్యకర్తలు
ప్రధాని పదవిలో ఉన్నప్పటికీ మోదీ బీజేపీ కార్యకర్తలతో వినయపూర్వకంగా మాట్లాడటంతో వారు ముగ్ధులయ్యారు. మోదీ వెంట బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, బీజేపీ నేతలు పర్దీప్ సింఘ్ వాఘేలా, హర్ష్ సంఘ్వీలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఆదివారం గుజరాత్‌లో వెరావల్, ధోరాజీ, అమ్రేలి, బొటాడ్‌లలో జరిగిన నాలుగు ర్యాలీల్లో పాల్గొన్నారు.182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.
Updated Date - 2022-11-21T09:05:07+05:30 IST