Mainpuri Bypoll Results: మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఫలితంపై అందరి దృష్టి
ABN, First Publish Date - 2022-12-08T08:16:12+05:30
దేశంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల పర్వంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఫలితంపై అందరి దృష్టి పడింది...
న్యూఢిల్లీ: దేశంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల పర్వంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఫలితంపై అందరి దృష్టి పడింది.(Mainpuri Bypoll Results) మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మెయిన్‌పురి లోక్‌సభ స్థానంపై(Mainpuri Lok Sabha) బీజేపీ-ఎస్పీ(BJP-SP battle) మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, ఖతౌలీ, ఒడిశాలోని పదంపూర్, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్, బీహార్‌లోని కుర్హానీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్ అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు సాగుతోంది. అక్టోబర్‌లో సమాజ్‌వాదీ పార్టీ పితామహుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ములాయం ఐదు పర్యాయాలు గెలుపొందారు. 2014 మోడీ వేవ్, 2019 సార్వత్రిక ఎన్నికలలో కూడా బీజేపీ మెయిన్‌పురి పార్లమెంటు స్థానాన్ని ఎన్నడూ గెలుచుకోలేదు.ములాయం సింగ్ యాదవ్ పెద్ద కోడలు, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల బరిలో దిగారు. ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్‌కు నమ్మకస్తుడైన రఘురాజ్ సింగ్ షాక్యాను బీజేపీ రంగంలోకి దించింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై చేసిన వ్యాఖ్యలపై 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో రాంపూర్ జిల్లా కోర్టు ఆజం ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో రాంపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఖాన్ జైలు శిక్ష రెండేళ్ల కంటే ఎక్కువ ఉన్నందున తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు.
Updated Date - 2022-12-08T08:41:20+05:30 IST