ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MCD polls: 10 హామీలను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ

ABN, First Publish Date - 2022-11-11T16:10:48+05:30

న్యూఢిల్లీ: నగరంలో మూడు డంపింగ్ సైట్లను క్లియర్ చేస్తామని, అవినీతి రహితంగా ఎంసీడీని తీర్చిదిద్దుతామని, ఎంసీడీ ఉద్యోగులకు క్రమం తప్పకుండా వేతనాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నగరంలో మూడు డంపింగ్ సైట్లను క్లియర్ చేస్తామని, అవినీతి రహితంగా ఎంసీడీని తీర్చిదిద్దుతామని, ఎంసీడీ ఉద్యోగులకు క్రమం తప్పకుండా వేతనాలు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. 10 హామీలతో కూడిన పత్రాన్ని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా హాజరయ్యారు. ఎంసీడీని 15 ఏళ్ల పాటు పాలించిన బీజేపీ తమ హయాంలో చేసిందేమీ లేదని, ఆప్ మాత్రం ఇచ్చిన హామీలకు ఎప్పుడూ కట్టుబడే ఉంటుందని కేజ్రీవాల్ ఈ సందర్భంగా అన్నారు. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లు మించి రావని జోస్యం చెప్పారు. ఢిల్లీని నడిపే వాళ్లకే ప్రజలు ఓట్లు వేయాలని, అభివృద్ధిని అడ్డుకునే వారికి కాదని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

''ఆన్‌లైన్ ప్రోసెస్ బిల్డింగ్ మ్యాప్ అప్రూవల్ ద్వారా ఎంసీడీని అవినీతిరహితంగా తీర్చిదిద్దుతాం. పార్కింగ్ స్థలం, రోడ్లపై తిరుగాడే జంతువుల వల్ల ఏర్పడే సమస్యలు, మరమ్మతు పనుల సమస్యలకు ఆచరణ సాధ్యమైన శాశ్వత పరిష్కారం చూపుతాం. ఎంసీడీ స్కూళ్లు, డిస్పెన్సరీలలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరుస్తాం. పార్కుల సుందరీకరణ చేపడతాం. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందేలా చూస్తాం'' అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వ్యాపారులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, కన్వర్షన్ చార్జీలు తగ్గించి వారికి ఉపశమనం కల్పిస్తామని, ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు చరమగీతం పాడతామని, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి వీధుల్లో తిరిగి అమ్మకాలు సాగించే వారికి లైసెన్సులు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు.

ఏకకాలంలో ఎన్నికలు పెట్టినప్పటికీ...

ఆప్‌ను అడ్డుకునేందుకే ఎంసీడీ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికలు ఏకకాలంలో పెట్టారని ముఖ్యమంత్రి ఆరోపించారు. అయినప్పటికీ అటు గుజరాత్‌లోనూ, ఇటు ఎంసీడీ ఎన్నికల్లోనూ ఆప్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీకి 20కి మించి సీట్లు రావని తాను రాసిస్తానని, 15 ఏళ్ల పాటు ప్రజలను వాళ్లు (బీజేపీ) వంచించారని, ఆప్ మాత్రం ఏది చెప్పిందో అది చేసి చూపిస్తుందని అన్నారు. కేంద్ర నుంచి డబ్బులు తెచ్చి న్యూఢిల్లీని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతామని బీజేపీ ఇస్తున్న హామీలు కేవలం నీటిమూటలేనని చెప్పారు.

Updated Date - 2022-11-11T16:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising