ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode By Election: ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. తొమ్మిది గంటలకు తొలి ఫలితం

ABN, First Publish Date - 2022-11-04T20:32:58+05:30

రెండు నెలలుగా హోరాహోరీ ప్రచారం, చివరి రెండు రోజుల్లో విస్తృతంగా ప్రలోభాలు, పోలింగ్‌ సాయంత్రానికి ఎగ్జిట్‌ పోల్స్‌ అయినప్పటికీ గెలుపుపై ఎవరి ధీమా వారికే ఉంది.

Munugode
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: రెండు నెలలుగా హోరాహోరీ ప్రచారం, చివరి రెండు రోజుల్లో విస్తృతంగా ప్రలోభాలు, పోలింగ్‌ సాయంత్రానికి ఎగ్జిట్‌ పోల్స్‌ అయినప్పటికీ గెలుపుపై ఎవరి ధీమా వారికే ఉంది. ఎగ్జిట్‌పోల్స్‌ తమకు అనుకూలంగా ఉన్నాయి, విజయం తమదేనని కారు గుర్తు శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఎగ్జిట్‌పోల్స్‌ అన్నివేళలా నిజం కాలేదు, మధ్యాహ్నం తర్వాత యువత పెద్దసంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు, వృద్ధులు కారు గుర్తుకు వేయలేకపోయారని ఇలాంటి కానరాని కారణాలు ఎన్నో తమ విజయానికి దోహదం చేస్తాయని పువ్వు గుర్తు పార్టీ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ఈవీఎంలలో అభ్యర్థుల భవిత్యవం భద్రంగా ఉంది. ఈ నెల 6వ తేదీన బాక్స్‌లు తెరిస్తే ఎవరి భవితవ్యం ఏంటో తెలియనుంది. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చే, ఢిల్లీ రాజకీయాల్లో తెలంగాణ పాత్రను తేల్చే మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆది నుంచి ఒత్తిడి, ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అధికారులు పటిష్ఠ భద్రత మధ్య ఈవీఎంలను పహారా కాస్తున్నారు. కౌంటింగ్‌కు మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు.

మొదటి రౌండ్‌ ఫలితం 9 గంటలకు

నల్లగొండలో 6వ తేదీన జరిగే కౌంటింగ్‌ ప్రక్రియలో మొదటి రౌండ్‌ ఫలితం ఉదయం తొమ్మిది గంటలకు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 15 రౌండ్లలో పూర్తి ఫలితం వెల్లడికానుంది. ఈ 15 రౌండ్లలో 298 పోలింగ్‌ కేంద్రాల్లో పోల్‌ అయిన ఓట్లన్నింటినీ లెక్కించనున్నారు. మొదటగా చౌటుప్పల్‌ మండలం ఓట్లను ఆ తర్వాత సంస్థాన్‌నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్వో రోహిత్‌సింగ్‌తో పాటు కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. కౌంటింగ్‌ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకునేలా ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది.

Updated Date - 2022-11-04T20:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising